Close

Chief Minister Shri YS Jagan Mohan Reddy formally inaugurated the Orvakal Airport of Kurnool District on 25-03-2021

Publish Date : 25/03/2021
KAI

లాంఛనంగా కర్నూలు /ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ ను ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి :-

కర్నూలు, మార్చి 25 :-

కర్నూలు/ఓర్వకల్లు ఎయిర్పోర్ట్ టెర్మినల్ బిల్డింగ్ వద్ద దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ఆవిష్కరణ అనంతరం ప్యాసింజర్ టెర్మినల్ బిల్డింగ్ ఈ రోజు మధ్యాహ్నం 12:40 గంటల సమయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్ మోహన్ రెడ్డి రిబ్బన్ కట్ చేసి విమానాశ్రయాన్ని లాంఛనంగా ప్రారంభించరు.

👉🏻చరిత్రలో నిలిచిపోయే విధంగా కర్నూలు/ఓర్వకల్ విమానాశ్రయం పేరును ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఎయిర్ పోర్టుగా నామకరణం చేస్తూ ప్రజలకు అంకితం :-

👉🏻ఈ నెల 28 నుండి విమానయాన రాకపోకలు ప్రారంభం :-

👉🏻ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేసి ఒకేసారి నాలుగు విమానాలు పార్కు చేసుకునేలా సౌకర్యం :-

👉🏻లాంఛనంగా కర్నూలు/ఓర్వకల్ విమానాశ్రయం శిలాఫలకం ఆవిష్కరణ ప్రారంభోత్సవం :-

👉🏻కర్నూలు/ఓర్వకల్ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ఆవిష్కరణ :-

👉🏻రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి :-

కర్నూలు/ఓర్వకల్ విమానాశ్రయం పేరును ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఎయిర్ పోర్టుగా నామకరణం చేస్తూ ప్రజలకు అంకితం చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.

గురువారం ఓర్వకల్ ఎయిర్ పోర్టును రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవం చేసి దశాబ్దాల కాలం నుండి ఎదురు చూస్తున్న కందనవోలు జిల్లా ప్రజల కలలను నెరవేర్చారు. విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి కర్నూలు ఎయిర్పోర్ట్ శిలాఫలకాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ కర్నూలు జిల్లాలో..రేనాటి వీరుడుగా..ప్రసిద్ధ స్వాతంత్ర్య సమరయోధుడుగా పేరు పొందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పేరును ఖరారు చేస్తూ ఆయనకు నివాళిగా..ఓర్వకల్ ఎయిర్ పోర్టును ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి ఎయిర్ పోర్టుగా నామకరణం చేస్తున్నామన్నారు. ఈ రోజు కర్నూలు జిల్లా చరిత్రలో నిలిచిపోయే రోజన్నారు. ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభంతో న్యాయ రాజధాని కర్నూలు నుండి రోడ్డు మార్గం ద్వారా దూర ప్రాంతాలకు వెళ్లే ప్రజలకు ఈనెల 28 నుండి విమాన ప్రయాణం అందుబాటులోకి తెస్తున్నట్లు సిఎం వివరించారు. 2019 ఎన్నికల ముందు హడావుడిగా.. అసంపూర్తిగా ..ఎటువంటి డిజిసీఏ అనుమతులు లేకుండా ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ ను అప్పటి ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు.

గత ఏడాదిన్నర కాలంలో టెర్మినల్ భవనం, ఐదు ఫోర్లలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, పోలీస్ బ్యారక్, ప్యాసింజర్ లాంజ్, విఐపి లాంజ్, వాటర్ ఓవర్ హెడ్ టాంక్, సబ్ స్టేషన్లు, రన్ వే లోని పెండింగ్ పనులను110 కోట్ల రూపాయలను ఖర్చు పెట్టి  యుద్ధ ప్రాతిపాదికన పూర్తి చేయడం జరిగిందన్నారు. ఆస్ట్రియా నుండి దిగుమతి చేసుకున్న రెండు అధునాతన అగ్నిమాపక శకటాలను కూడా ఎయిర్పోర్టులోనే అందుబాటులో ఉంచడం జరుగుతుందన్నారు. ప్యాసింజర్ టెర్మినల్ వద్ద కార్ రేంజర్, వివి కేర్, మెడికల్ కేర్ వంటి అన్ని సదుపాయాలను అందుబాటులో ఉంచుతామన్నారు. ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ పెండింగ్ పనులన్నింటినీ పూర్తి చేయడంతో పాటు ఒకేసారి నాలుగు విమానాలు పార్కు చేసుకునేలా సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకు వచ్చామన్నారు. తిరుపతి, కడప, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం ఎయిర్ పోర్ట్ లతో పాటు ఓర్వకల్ ఎయిర్ పోర్టును రాష్ట్రంలో 6వ ఎయిర్ పోర్టుగా తీసుకొచ్చామన్నారు. ఈ నెల 28 నుండి ఓర్వకల్ ఎయిర్ పోర్టు నుండి తొలి కమర్షియల్ ప్యాసింజర్ ఫ్లైట్స్ మొదలు ఆవుతాయన్నారు.

విమానాశ్రయానికి సంబంధించి ఎటిసి, పౌరవిమానయాన అనుమతులు రప్పించడంలో, తెప్పించడంలో అన్ని నిర్మాణాలు పూర్తి చేయడంలో మన మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు చేసిన కృషి అభినందనీయమని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.

మన ప్రభుత్వం చేస్తున్న మంచి పనులకు మద్దతు నిస్తూ నిండు హృదయంతో ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీలు, మున్సిపాలిటీ ఎన్నికల్లో మన ప్రభుత్వానికి ఘన విజయం సాధించి పెట్టారన్నారు.

అనంతరం.. కర్నూలు/ఓర్వకల్ విమానాశ్రయం ప్రారంభోత్సవం సందర్భంగా ప్రత్యేక పోస్టల్ స్టాంప్ ను  ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విడుదల చేసారు.

అంతకుముందు పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ ఓర్వకల్ ఎయిర్ పోర్ట్ ప్రారంభోత్సవంతో జిల్లా ప్రజల కలలను నిజం చేసారన్నారు.   ఎయిర్పోర్టులో అనేక పనులు పెండింగ్ లో ఉండగానే గత ప్రభుత్వం మొక్కుబడి రీతిలో ప్రారంభోత్సవం చేశారన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే ప్రజల ముందు మాట చెప్పారో దానికి కట్టుబడి విమాన రాకపోకలు ప్రారంభమైతేనే ఎయిర్పోర్ట్ ప్రారంభిస్తానని సీఎం తెలిపారన్నారు. పెండింగ్లో ఉన్న పనులకు ఆర్థిక మంత్రి నిధులు మంజూరు చేయడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. ప్రజలకు జవాబుదారీ తనంతో వుండాలని ముఖ్యమంత్రి అనేక సందర్భాలలో సూచించారన్నారు.

ఓర్వకల్లు ఒక ప్రాంతంలో మల్లికార్జున రిజర్వాయర్  నిర్మాణానికి ఇన్వెస్టిగేషన్ పనులను ప్రారంభించి ప్రజలకు సాగు, తాగునీరు కొరత లేకుండా మంజూరు చేయాలని ఎమ్మెల్యే సిఎం ను కోరారు.

అనంతరం ఎయిర్ పోర్ట్ ప్యాసింజర్ టెర్మినల్ భవనం ముందు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహాన్ని ఆవిష్కరించి డిస్పాచ్ గేట్ వద్ద లాంఛనంగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం విమానాశ్రయం లోపల భవనాలను పరిశీలన చేసి సిబ్బందితో గ్రూప్ ఫోటో దిగి విజయవాడకు ప్రత్యేక విమానంలో బయలుదేరి వెళ్లారు.

జిల్లా ఇన్చార్జి మంత్రి రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ పి.అనిల్ కుమార్, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం, ప్రభుత్వ విప్ గంగుల ప్రభాకర్ రెడ్డి, కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్, నంద్యాల ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్, పాణ్యం శాసన సభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే డాక్టర్ జె.సుధాకర్, ఆళ్లగడ్డ ఎమ్మెల్యే బిజేంద్రనాథ్ రెడ్డి, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి, పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవి, మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి, నంద్యాల ఎమ్మెల్యే రవిచంద్ర కిషోర్ రెడ్డి, బనగానపల్లె ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి, నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్, ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు, కర్నూలు నగరపాలక సంస్థ మేయర్ బి.వై రామయ్య, ప్రజాప్రతినిధులు, పరిశ్రమల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ కరికాల వలవన్, ఎయిర్ పోర్ట్ మేనేజింగ్ డైరెక్టర్  జిల్లా కలెక్టర్ జి.వీరపాండియన్, జేసీ (రెవెన్యూ మరియు అభివృద్ధి)లు రామ సుందర్ రెడ్డి, కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ డి.కె బాలాజీ తదితరులు పాల్గొన్నారు.

—————————————-

డివిజినల్ పిఆర్ఓ, కర్నూలు వారి ద్వారా జారీ.