భూగర్భ జల మరియు జల గణన
పరిచయం
జల వనరులు – మైనర్ ఇరిగేషన్ క్రింద భూగర్భ జల మరియు జల గణన శాఖ (భూగర్భ జల శాఖ) మార్చి -1971 సంవత్సరములో నెలకొల్పబడినది. భూగర్భ జల శాఖ జరుపు కార్యక్రమాలన్నీ సంచాలకులు,భూగర్భ జల శాఖ రాష్ట్ర రాజధాని వారి ఆధ్వర్యములో జరుగును.
సంస్థాగత నిర్మాణ క్రమము
భూగర్భ జల శాఖ నిర్వహించు కార్యక్రమములు :
- ముఖ్యంగా త్రాగు నీరు,వ్యవసాయము మరియు పరిశ్రమల కొరకు కొత్తగా బోరు బావులు త్రవ్వుటకు అనువైన స్థలములు ఎంపిక జరుపబడును
- మైనర్ ఇరిగేషన్ ప్రోగ్రాం క్రింద వివిధ సంస్థలు అనగా ఆర్.డబ్లు.ఎస్, పరిశ్రమలు, షెడ్యూల్డు కులములు , షెడ్యూల్డు తెగలు, వెనుకబడిన కులములు సంబంధించిన కార్పోరేషన్లు, డి.ఆర్.డి.ఎ., డి.డబ్లు.యం.ఏ, జల వనరుల శాఖ, వ్యవసాయ, పండ్ల తోటలు, సేరికల్చర్, ఎ.పి.యం.ఐ.పి మొదలగు సంస్థలు బలహీన వర్గాలైన సన్నకారు మరియు మార్జినల్ రైతులకు చేపట్టబడే కార్యక్రమాలకు అనుసంధానకర్తగా వ్యవహరింపబడును.
- షెడ్యూల్డు కులములు , షెడ్యూల్డు తెగలు వారికీ షెడ్యుల్డ్ కులముల సబ్ ప్లాను , షెడ్యుల్డ్ తెగల సబ్ ప్లాను ప్రోగ్రాము నందు బోరు బావుల డ్రిల్లింగ్ జరపబడుచున్నది.
- స్యాండు మైనింగు మరియు వల్టా చట్టము క్రింద బోరు బావుల కొరకు సాంకేతిక ఫీజబులిటీని ఇవ్వబడుచున్నది.
- ప్రతి నెల పరిశీలక బావుల నుండి నీటి కొలతలు మరియు సంవత్సరము నందు రెండు సార్లు నీటి మచ్చులు పూర్తి విశ్లేషణ కొరకు ఋతుపవనాల ముందు తరువాత సేకరించబడును.
- జిల్లాలోని 147 ఫిజోమీటర్ల నుంచి ఆటోమాటిక్ వాటర్ లెవెల్ రికార్డరు మరియు టెలిమెట్రి ద్వారా ప్రతి గంటకు నీటి మట్టములు, నిరంతరముగా సేకరించబడుచున్నది.ఈ దతాంశమును ఎప్పటికప్పుడు సిఎం కోర్ డాష్ బోర్డు వెబ్ అడ్రస్సు ద్వారా తెలుసుకొనవచ్చును . ప్రతి గ్రామము నందు భుగార్భ జల లభ్యము, వినియోగము, భావిష్యత్ నకు మిగులు జలముల అంచనా వేయబడును.
- ప్రభుత్వం జి.ఓ.నం.06, పంచాయితీ రాజ్ మరియు రూరల్ డెవవలప్ మెంట్.(ఆర్ డి.2) డిపార్టుమెంటు తేది: 25.01.2018 ద్వారా 56 గ్రామాలు అతినీటి వినియోగ స్థాయి గ్రామాలుగా నోటిపై చేయబడినవి.ఈ గ్రామాలలో త్రాగునీటికీ మినహా , ఇతరములకు బోరుబావులు వేయుట నిషేదించడమైనది.
ఇంక్యుమ్బెంట్స్ యొక్క చిరునామాలు వాటర్ క్వాలిటీ ల్యాబ్ లెవల్– II,బీ.తాండ్రపాడు,కర్నూలు
బీ.గోపాల్, యం ఎస్ సి,
డిప్యూటీ డైరెక్టర్,
భూగర్భ జలలు మరియు జల గణన శాఖ,
ఎఫ్ అర్ ఎల్ సమ్మేళనం, ఎ- క్యాంపు,
విజయా మిల్క్ డైరీ దగ్గర,
కర్నూలు -518002
సెల్: 8333991261
ఆఫీస్ నెంబర్: 08518-255923
ఈ మెయిల్:ddgwdknl[at]gmail[dot]com, ddgwdknl[at]rediffmail[dot]com