ముగించు

మండలము

ఈ ఉపవిభాగము మండలాలుగా విభజించబడినది. ఒక్కక్క మండలానికి తహసిల్దారు అధికారిగా వుండును.

గత కాలములో తాటాకులపై న్యాయపరమైన అధికారములు కలిగిన తహసీల్దార్లు ఉండేవారు. అదే అధికారములతోను, విధులతోను నేటి మండల రెవిన్యూ అధికారాలు పనిచేయుచున్నారు. మండల రెవిన్యూ కార్యాలయమునకు మండల రెవిన్యూ అధికారి వుంటాడు. మండల రెవిన్యూ అధికారి తన అధికార పరధిలో వున్న ప్రభుత్వము మరియు ప్రజల మధ్య సమన్వయము కుదుర్చును. ఇతడు తన అధికార పరిధిలో సంక్షేమ పధకాలను ప్రవేశపెట్టును. సమాచారము సేకరించుటలోను, విచారణలు జరుపుటలోను, ఉన్నత అధికారులకు మండల రెవిన్యూ అధికారి సహకరించును పరిపాలనలో ఉన్నత స్థాయిలో నిర్ణయాలు తీసుకొనుటకు జిల్లా పరిపాలనకు తన అభిప్రాయములను వెల్లడిపరుచును.

డిప్యూటీ తహసీల్దార్ , మండల రెవిన్యూ ఇన్ స్పెక్టర్, సూపరింటెండెంట్, మండల సర్వేయర్, సహాయ గణాలకు అధికారి మరియు ఇతర మంత్రివర్గ సిబ్బంది. డిప్యూటీ తహసిల్దార్ మండల రెవిన్యూ కార్యాలయములో రోజువారీ పనులను పర్యవేక్షించును మరియు ముఖ్యముగా సామాన్య పరిపాలనలో పాల్గొనును. చాలా దస్త్రములు ఇతని ద్వారానే జరుగును. మండల రెవిన్యూ కార్యాలయములో అన్ని విభాగములు ఇతని ద్వారా పర్యవేక్షించబడును.

మండల రెవిన్యూ ఇన్ స్పెక్టర్ విచారణలు జరుపుటలో, తనిఖీలు చేయుటలో మండల రెవిన్యూ అధికారికి సహకరించును. ఇతడు గ్రామా రెవిన్యూ అధికారలను పర్యవేక్షించును. ఇతడు పంటపొలాలను తనిఖీచేయును (అజిమాయిషి), షరాలు, పహనీలో వ్రాయును (క్షేత్ర తనిఖీల వివరములు). ఇతడు భూమి శిస్తును, వసూలు చేయును, వ్యవసాయేతర భూముల విశ్లేషణ మరియు బకాయిలు, మొదలగు వాటిని తన న్యాయపరిధిలో చట్టము మరియు ఆజ్ఞ కొరకు గ్రామములను పరిశీలించును. రాష్ట్రస్థాయిలో జిల్లా మరియు డైరెక్టరేట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ స్టాటిస్టిక్స్ లో ముఖ్య ప్రణాళిక అధికారి అద్వర్యంలో పనిచేయు సహాయ గణాంక అధికారి వర్షపాతము, పొలాలు, జనభాకు సంబందించిన వివరములను సేకరించును. ఇతడు పంటల అంచనా పరీక్షలను నిర్వహించును. ఇతడు పంట పొలాల యొక్క స్థితుల వివరములను సేకరించుటకు పంటపొలాలను తనిఖీ చేయును. ఇతడు జనన మరణ వివరముల ఆవర్తక నివేదికలు తయారుచేయును. కాలానుగుణముగా ప్రభుత్వము నిర్వహించు పశు గణాంకములు, జనాభా లెక్కలు ఇతర సర్వేలు జరుపుటలో మండల రెవిన్యూ అధికారికి సహకరించును. మండల రెవిన్యూ అధికారి ఫై విషయములకు సంబంధించిన నివేదికను జిల్లా కలెక్టరుకు అందజేయును. తరువాత ఈ నివేదికలు ఎకనామిక్స్ మరియు స్టాటిస్టిక్స్ మరియు ప్లానింగ్ శాఖలకు పంపించబడును.

సర్వే సెటిల్ మెంట్ మరియు ల్యాండ్ రికార్డుల శాఖకు చెందిన మండల సర్వేయరు సర్వే కార్యకలాపాలలో మండల రెవిన్యూ అధికారి సహకరించును.

మండల సర్వేయరు విధులను నిర్వహించుటలో చైనమేన్ సహకరించును.

నిర్వహణ సంస్కరణల ప్రకారము, తహసీల్దార్ కార్యాలయములో గల వివిధ విభాగములు.

  1. విభాగము ఎ : కార్యాలయము పద్ధతి ,ఆర్ధిక కార్యాకలాపాలు మరియు వెబ్ ల్యాండ్ నందు ఫారం 8 ని జనరేట్ చేయుట.
  2. విభాగము బి : భూ సంబంధ కార్యకలాపాలు, పౌర సరఫరాలు మరియు విపత్తుల నిర్వహణ.
  3. విభాగము సి : పింఛను పధకాలు, జీత భత్యములు, బడ్జెట్ మరియు ఎస్టాబ్లిష్మెంట్.
డివిజన్ వారిగ మండలముల వివరములు
క్ర.స డివిజన్ పేరు మండలం పేరు ఫోన్ నెంబర్ ఇమెయిల్
1 ఆదోని ఆదోని 9849904161 mroadn13@rediffmail[dot]com
2 ఆదోని ఆలూరు 9849904167 mroalur@gmail[dot]com
3 ఆదోని ఆస్పరి 8333988998 mro[dot]aspari@gmail[dot]com
4 ఆదోని చిప్పగిరి 8333989014 thsildarchippagiri@gmail[dot]com
5 ఆదోని దేవనకొండ 8333988958 mrodevanakonda@gmail[dot]com
6 ఆదోని గోనెగండ్ల 8333988959 mroggl1320@gmail[dot]com
7 ఆదోని హాలహర్వి 8333989015 bsvt0624918@gmail[dot]com
8 ఆదోని హోలగొంద 8333989016 bnarasappa79@gmail[dot]com
9 ఆదోని కోసిగి 8333988996 venusurya95@gmail[dot]com
10 ఆదోని కౌతాలం 8333988995 dgopalrao926@gmail[dot]com
11 ఆదోని మద్దికేర 8333989019 tahsildar[dot]mdr@gmail[dot]com
12 ఆదోని మంత్రాలయం 8333988993 pveeresh91@yahoo[dot]com
13 ఆదోని నందవరం 8333988997 mrondvm1304@gmail[dot]com
14 ఆదోని పత్తికొండ 8333989017 tahsildarpattikonda12@gmail[dot]com
15 ఆదోని పెద్దకడుబురు 8333988994 rameshvadde1@gmail[dot]com
16 ఆదోని తుగ్గలి 8333989018 mrotug@gmail[dot]com
17 ఆదోని ఎమ్మిగనూరు 9849904177 mroygr1321@gmail[dot]com
18 కర్నూలు ప్యాపులి 8333988965 tahsildar_pplly@yahoo[dot]com
19 కర్నూలు ఆత్మకూరు 8333988972 tahsildaratmakur@yahoo[dot]in
20 కర్నూలు సి భేలగల్ 9885422733 tah[dot]cbelagal@gmail[dot]com
21 కర్నూలు ధోన్ 9849904174 mrodhone@gmail[dot]com
22 కర్నూలు గూడూరు 9849904168 gudurtahsildar@gmail[dot]com
23 కర్నూలు జూపాడు బంగ్లా 8333988970 zakirhussain[dot]s@ap[dot]gov[dot]in
24 కర్నూలు కల్లూరు 8333988961 kallurtahsildar@gmail[dot]com
25 కర్నూలు కోడుమూరు 8333988963 ramakishna[dot]bandi@ap[dot]gov[dot]in
26 కర్నూలు కొత్తపల్లె 8333988973 ramakrishna[dot]panyam@ap[dot]gov[dot]in
27 కర్నూలు క్రిష్ణగిరి 8333988966 ramasubbaiah[dot]m@ap[dot]gov[dot]in
28 కర్నూలు కర్నూలు 9849904173 krnltahsildar@gmail[dot]com
29 కర్నూలు మిడ్తూరు 8333988971 tahsildarmro@gmail[dot]com
30 కర్నూలు నందికొట్కూరు 8333988968 mro[dot]ndk[dot]knl@gmail[dot]com
31 కర్నూలు ఓర్వకల్లు 8333988962 tahsildarorvakal@gmail[dot]com
32 కర్నూలు పగిడ్యాల 8333988969 tahsildarpgdl@gmail[dot]com
33 కర్నూలు పాములపాడు 8333988974 nagendrarao[dot]sutraya@ap[dot]gov[dot]in
34 కర్నూలు శ్రీశైలం 9849741513 sreenivasulu[dot]kv@ap[dot]gov[dot]in
35 కర్నూలు వెలుగోడు 8333988975 mro[dot]vgd@gmail[dot]com
36 కర్నూలు వెల్దుర్తి 8333988967 ramanjula[dot]banavati@ap[dot]gov[dot]in
37 కర్నూలు బేతంచెర్ల 9052882180 tahsildar[dot]bethamcherla@gmail[dot]com
38 నంద్యాల బండి ఆత్మకూరు 8333988977 tahildarbatk1333@gmail[dot]com
39 నంద్యాల కోయిలకుంట్ల 8333988984 tahsildarkoilakuntla@gmail[dot]com
40 నంద్యాల ఆళ్లగడ్డ 8333988979 tahsildar[dot]alg@gmail[dot]com
41 నంద్యాల బనగానపల్లె 8333988991 tahsildarbpl@gmail[dot]com
42 నంద్యాల చాగలమర్రి 8333988983 tahsildarcmi@gmail[dot]com
43 నంద్యాల దొర్నిపాడు 8333988979 dornipadu[dot]tah@gmail[dot]com
44 నంద్యాల గడివేముల 8333988978 tahsildargadivemula@gmail[dot]com
45 నంద్యాల గోస్పాడు 8333988982 tah[dot]gospadu123@gmail[dot]com
46 నంద్యాల కొలిమిగుండ్ల 8333988990 kgl[dot]tahsildar@gmail[dot]com
47 నంద్యాల మహానంది 9849152599 tahsildar1335@gmail[dot]com
48 నంద్యాల నంద్యాల 9849904176 nandyaltahsildar@gmail[dot]com
49 నంద్యాల ఔకు 8333988992 owktahsildar@gmail[dot]com
50 నంద్యాల పాణ్యం 8333988957 tahsildarp@gmail[dot]com
51 నంద్యాల రుద్రవరం 8333988981 rdvm2012@gmail[dot]com
52 నంద్యాల సంజామల 8333988986 tahsildarsjl@gmail[dot]com
53 నంద్యాల సిరివెల్ 8333988980 tahsildarsirvel@gmail[dot]com
54 నంద్యాల ఉయ్యాలవాడ 8333988987 uyy[dot]tahsildar@gmail[dot]com
55 కర్నూలు కర్నూలు అర్బన్