ముగించు

ఆంధ్ర ప్రదేశ్ సుక్ష్మ నీటి సాగు పథకం

ఆంధ్ర ప్రదేశ్ సుక్ష్మ నీటి సాగు పథకం (APMIP), మన రాష్టం లో 13 సంవత్శరాల క్రితం అంటే 2003 నవంబర్ నెలలో ప్రరం బించబడినది ఈ పథకం యొక్క ముక్య ఉద్దేశం ఉన్న నీటి వనరులను ఉపయోగించి రైతుల ఆర్థిక స్తితిగతులను మెరుగుపరచడం , తక్కువ నీటితో ఎక్కువ విస్తేర్ణం లో అదిక దిగుబడులతో నాణ్యమైన పంటలను సాగు చేయడం , భూగర్బ జలాలను పెంచుతూ వ్యవసాయ కర్చులను తగ్గించడం రైతులకు మరింతగా చేయుతనివ్వడానికి ఈ పథకమును ప్రభుత్వం ప్రరంబించింది

లోటు వర్షపాతం, వర్షపు నీడ ప్రాంతాలు, అనూహ్యమైన వర్షాలు మరియు భూగర్భ జలాల యొక్క గణనీయమైన క్షీణత దృష్ట్యా వ్యవసాయ క్షేత్రం ” ప్రతి చినుకుకు మరింత పంట” అనే భావనను సాధించటానికి మైక్రో ఇరిగేషన్ యొక్క సాంకేతికతలను అవలంబించవలసిన అవసరముంది. ఆంధ్రప్రదేశ్లోని 13 జిల్లాలలో మైక్రో ఇరిగేషన్ కింద వచ్చే ఐదు సంవత్సరాలలో మొత్తం సంభావ్య ప్రాంతాన్ని అందుబాటులో ఉంచేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

GOI ఒక కొత్త పథకాన్ని రూపొందించింది, “నేషనల్ మిషన్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్” (NMSA) 2014-15 నుండి అమలులోకి తీసుకొంది, ఇది స్థిరమైన వ్యవసాయంకు సంబంధించిన అన్ని నూతనమైన మరియు కొత్తగా ప్రతిపాదిత కార్యకలాపాలు / కార్యక్రమాలు, సంగ్రహించడం ద్వారా రూపొందించబడింది నేల మరియు నీటి పరిరక్షణ మరియు నీటి ఉపయోగం సమర్థత, నేల ఆరోగ్యం నిర్వహణ మరియు వర్షం ఫెడ్ ఏరియా అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ. 2013-14 వరకు అమలు చేయబడిన మైక్రో ఇరిగేషన్ (NMMI) పథకం ప్రస్తుత జాతీయ మిషన్ 2014-15 నుండి NMSA కు వర్తిస్తుంది.

సాగు వ్యవసాయం కోసం నేషనల్ మిషన్ యొక్క నాలుగు విభాగాల్లో ఆన్ ఫార్మ్ వాటర్ మేనేజ్మెంట్ (OFWM) ఒకటి, ఇది ప్రధానంగా నీటి వినియోగ సామర్ధ్యాన్ని మెరుగుపరచడం మరియు వ్యవసాయ క్షేత్ర నిర్వహణ టెక్నాలజీస్ మరియు సామగ్రిపై సమర్థవంతమైన ప్రచారం కోసం దృష్టి పెడుతుంది. ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు(APMIP) ద్వారా రాష్ట్రంలో వ్యవసాయ నీటి నిర్వహణ (OFWM) అమలు చేయబడుతుంది.‎.

సుక్ష్మనీటి సాగు పథకము వలన ఉపయోగాలు :

Fruits
  • నీటి ఆదా
  • పంట విస్తేర్ణం మరియు దిగుబడి పెరుగుతుంది
  • కూలీల కర్చు తగ్గుతుంది
  • బీడు భూములకు చాల ఉపయోగామయ్నది
  • వాలు భూములకు బాగా ఉపయోగామయ్నది
  • మొక్కలు ఎపుగా పెరుగుతాయి
  • కరెంటు కర్చు తక్కువ
  • ఎరువులు పూర్తి స్థాయేలో ఉపయోగించవచ్చును
  • మనకు అనుకూలముగా వాడుకోవచ్చును
  • భూమి కొత ఉండదు
  • భూమిని చదును చేయవలసిన అవసరం లేదు
  • పంట తెగుల్లాను నివారించ్చవచ్చును
  • అన్ని రకాల నేలలకు అనుకూలమైనది

Map

సుక్ష్మనీటి సాగు కు అనుకూలమైన అంశాలు

  • మొత్తం బావులు / గొట్టపు బావులు                                            1,44,032
  • వ్యవసాయయోగ్యం అయిన భూమి (హేక్టర్)                                   1,43,454
  • సుక్ష్మనీటి సాగు క్రింద ఉన్న భూమి (హేక్టర్)                                   107,064
  • ఇంకను సుక్ష్మనీటి సాగు క్రిందకి రావలసిన భూమి (హేక్టర్)                  36,390

రాయతి వివరములు :

  • ఎస్సి మరియు ఎస్టి  చిన్నకారు మరియు సన్నకారు రైతులకు (5 ఎకరములవరకు ) 2  లక్షల రూపాయలు వరకు  100 %  రాయతి
  • ఎస్సి మరియు ఎస్టి 5 ఎకరములు ఫై బడిన  రైతులకు  2  లక్షల రూపాయలు వరకు  90 %  రాయతి
  • చిన్నకారు మరియు సన్నకారు రైతులకు (10 ఎకరములవరకు) 2  లక్షల రూపాయలు వరకు  90 %  రాయతి
  • పెద్ద రైతులకు  (10 ఎకరములు ఫై బడిన  ) 4   లక్షల రూపాయలు వరకు  50 %  రాయతి
  • స్ప్రింక్లేర్ లు  అన్ని కేటగిరిల  రైతులకు  50 %  రాయతితో  ఇవ్వబడును
Explaining

పద్ధతులు  – విధి విదానాలు :

1) సుక్ష్మనీటి సాగు పద్దతులు : ఆంధ్ర ప్రదేశ్ సుక్ష్మనీటి సాగు పథకం వారు డ్రిప్ , ఫోర్తబుల్ స్ప్రింక్లేర్ , సెమి పెర్మనెంట్ స్ప్రింక్లేర్,  మినీ స్ప్రింక్లేర్ , మైక్రో స్ప్రింక్లేర్ , మరియు రెయిన్ గన్ పద్దతులు కలవు.

2) సుక్ష్మనీటి సాగు పథకము  ఎలాంటి వాటికీ వస్తుంది : బావులకు, గొట్టపు బావులకు , నీటి కుంటలకు , కెనాల్ చెరువు ద్వార నీరు లబించే వాటికీ ఈ పథకం వర్తిస్తుంది .

3) సుక్ష్మనీటి సాగులో టేక్నికల్  పద్దతులు: ఆన్ లైన్ మరియు ఇన్ లైన్  క్లి పద్దతులను అనుసరిస్తారు , ఆన్ లైన్ పద్ధతి లో దురం దూరంగా నాటే చెట్లకు ఇవి అమరుస్తారు ఇందులో గ్రావిటి ఫెడ్ ఫ్యామిలీ , మైక్రో జెట్స్ , మైక్రో స్ప్రింక్లేర్, డ్రిప్పర్ , ఏమిటేర్స్ , మరియు మినీ స్ప్రింక్లేర్ పద్దతులు పాటిస్తారు ,  ఇన్ లైన్ పద్దతిలో  సర్ఫ్ పేస్  సుబ్ సర్ పేస్ పద్దతులు పాటిస్తారు.

4) ఈ పథకమునకు  ఎవరు అర్హులు : నీటి వసతి కలిగిన అన్నిరకాల రైతులు అర్హులు

5)డ్రిప్ ఇరిగేషన్ ఎలా పని చేస్తుంది : మోటార్ ఆన్ చేయగానే పోలములోని అన్ని మొక్కల వేళ్ళ దగ్గర చిన్న నీటి గొట్టాల ద్వార చుక్క చుక్క నీరు పడుతుంది దీనీతో పొలమంత ఒకే సారి తడుస్తుంది , నీటిలో కరిగే ఎరువులను డ్రిప్ ద్వార అందిస్తే  ఎరువులు నేరుగా  మొక్కల దగ్గరే పడుతుంది ఈ పధతిలో నీరు , ఎరువులు ఆదా అవుతావి , కులిల కర్చు తగ్గుతుంది , పంట దిగుబడి పెరుగుతుంది.

6) డ్రిప్ ఇరిగేషన్ లో ప్రధాన పరికరములు : 

  • కంట్రోల్ వాల్యూ : నీటి పారుదల ఒత్తిడిని  అదుపులో ఉంచుతుంది
  • ఫిర్టిలిజేర్ / వెంచర్ ట్యాంక్ : నీటిలో కరిగే ఎరువులను ఈ ట్యాంక్ ల ద్వరా మొక్కల దగ్గరికి నీటి గొట్టాల ద్వార పంపిస్తారు .
  • స్క్రీన్ / సాండ్ ఫిల్టర్ : నీటిలోని మాలిన్యాలను ఒడగట్టి  నీటి గొట్టాలకు ఎలాంటి ఆటంకం లేకుండా చేస్తుంది .
  • లటేరాల్ పైప్స్ : మెయిన్ లైన్ లేదా సబ్ లైన్ ల నుండి పొలమునకు అంతటికి నీటిని సరపరా చేస్తుంది
  • డ్రిప్పెర్స్ : లటేరాల్ పైప్ నుండి మొక్కకు నీటిని నియంత్రణ చేసి పంపుతుంది

7)  స్ప్రింక్లేర్  ఇరిగేషన్ ఎలా పని చేస్తుంది : స్ప్రింక్లేర్ సిస్టం నీటి గొట్టముల ద్వార నీటిని విరచిమ్ముతు సహజ వాన మాదిరిగా మొక్కలను తడుపుతుంది పైప్ నుండి పంపింగ్ చేయబడిన నీరు నాజిల్ నుండి తుంపర్ల రూపంలో వర్షం మాదిరిగా పడుతుంది, మనకు పంటను బట్టి , కావల్సిన నీటిని విరజిమ్మే దూరన్ని బట్టి నాజిల్ ఎన్నుకోవాలి

8) డ్రిప్ మరియు స్ప్రింక్లేర్ కొరకు ఎలా ధరకాస్తు చేసుకోవాలి :

డ్రిప్ మరియు స్ప్రింక్లేర్ కావలసినవారు భూమి కి సంబందించిన పత్రాలు , ఆదార్ కార్డు , బ్యాంకు అకౌంట్ బుక్ జిరాక్స్ కాపీ లను తీసుకొని తమ సమీప మీ-సేవ కేంద్రాలలో గాని, ఎ పి ఎం ఐ పి జిల్లా ఆఫీస్ నందు గాని , ఎం.ఐ. కంపెనీ ప్రతినిదులవద్ధ కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవచును . రైతు తనకు ఇష్టమైన కంపెనీ ఎన్నుకోవచును.

2019 -20 ఆర్థిక ప్రణాళిక :  ఇ ప్రాజెక్ట్  ప్రధాన మంత్రి కృషి సంచాయీ యోజన క్రింద 2019 -20 ఆర్థిక సంవత్షరమునకు 27,500 హెక్టర్ ల లక్ష్యం గా నిర్ణ ఇంచినారు.

పంటలవారిగా ప్రణాళిక
వరుస సంక్య పంట డ్రిప్ (హె) స్ప్రింక్లేర్ (హె)
1 పండ్లు 3000
2 పూలు 1000
3 సుగంద ద్రవ్యాలు 3500
4 కూరాగాయలు 6500
5 వ్యవసాయ పంటలు 12000
6 ఇతర దిపార్త్మంట్ లతో కలసి చేయునవి 1500
మొత్తం 15500 12000
పూర్తి మొత్తం 27,500

రైతులు డ్రిప్ లేదా  స్ప్రింక్లేర్ కొరకు మీ- సేవ కేంద్రాలలో ధరకాస్తు చేసుకొనేవారు 2018 ఫీబ్రవరి చివరి లోపు చేసుకోవాలి.

2019 -19 లక్ష్య సాధనకు కార్యాచరణ  ప్రణాళిక :రైతులకు అవగాహనా కల్పిoచడానికి  హార్టికల్చర్ ఆఫీసర్స్ , ఎ పి ఎం ఐ పి అధికారులు , కంపెనీ ప్రతినిధులు గ్రామాలవారిగా , మండలలవారిగా , డివిజన్ ల పరిదిలో రైతు శిక్షణా తరగతులను నిర్వహిస్తున్నాము .

పరికరములను అమర్చిన తర్వాత వాటి నిర్వహణ ఫై  రైతులకు అవగాహనా కల్పించే కార్యక్రమము చేస్తున్నాము  వీటిని త్రెమాసీకముగా విబజించి ప్రణాళిక చేసేనము .

కంపెనీ ప్రతినిధులు గ్రామాలవారిగా వాహనములలో తిరుగుతూ రైతు ల దగ్గర వేలి ముద్రలు తీసుకొని తక్షణమే ఆన్ లైన్ నమూదు చేస్తునారు

ఎస్సి మరియు ఎస్టి రైతు ల కొరకు ప్రత్యేకంగా ప్రాంతీయ అధికారులను పంపి ఎక్కువ మంది రైతులకు అవగాహనా కల్పించి వారు లబ్ది పొందేవిదంగా చేస్తున్నాము.

అనుబంద శాఖలు అయిన  ఎన్ ఆర్ ఇ జి ఎస్ , పట్టు పరిశ్రిమ శాఖ, వ్యవసాయ శాఖల తో అనుసందానమై అక్కడి రైతు లకు కుడా అవగాహనా కల్పించి డ్రిప్ లేదా స్ప్రింక్లేర్ లబ్ది పొందేవిడంగా చేస్తున్నాము.

వరుస సంఖ్య ఎం ఐ కంపెనీ వరుస సంఖ్య ఎం ఐ కంపెనీ
1 అక్షయ 16 మహా నంది
2 అనంత 17 నాగార్జున
3 ఆస్థా 18 నంది
4 భూమి 19 నేటపిమ్
5 కెప్టెన్ 20 నుంబుస్
6 ఏమ్టేల్ 21 పారగాన్
7 ఇ పి సి 22 ప్రీమియర్
8 ఫినొలెక్ష్ 23 రివులాస్
9 ఫ్లో టెక్ 24 రుంట
10 గ్లోబల్ 25 సిఫ్లోన్
11 గోదావరి 26 సిగ్నేట్
12 జైన్ 27 శ్రీ అంజని
13 కిసాన్ 28 టెక్ష్మొ
14 కొఠారి 29 యు పి ఐ
15 కుమార్

ఎ పి ఎం ఐ పి – కర్నూల్ నందు పనిచేయుచున్న సిబ్బంది వివరములు

సిబ్బంది వివరములు
వరుస సంఖ్య స్థానము సిబ్బంది సంఖ్య
రెగ్యులర్ సిబ్బంది
1 ప్రాజెక్ట్ డైరెక్టర్ 1
2 సహాయ ప్రాజెక్ట్ డైరెక్టర్ 2
3 పర్యవేక్షకులు 1
ఔట్ సోర్సింగ్ సిబ్బంది
1 ఎం .ఐ .ఇంజనీర్ 5
2 ఎం.ఐ.క్రాప్ కో – అర్దినటర్ 3
3 ఎం.ఐ. ప్రాంతీయ అధికారి 25
4 అకౌంట్టెంట్ 1
5 సీనియర్  సహాయకుడు 1
6 జూనియర్ సహాయకుడు 2
7 కంప్యూటర్  ఆపరేటర్ 5
8 ఆఫీస్ సహాయకుడు 2

అధికారులను సంప్రదించడానికి  ఫోన్ నంబర్స్

వరుస సంఖ్య అధికారి స్థానము సెల్ నెంబర్
1 ప్రాజెక్ట్ డైరెక్టర్ 7995087059
2 సహాయ ప్రాజెక్ట్ డైరెక్టర్ 7995087089
3 పర్యవేక్షకులు 7995010105
4 ఎం .ఐ .ఇంజనీర్ -1 7995010106
5 ఎం .ఐ .ఇంజనీర్ -2 7995010107
6 ఎం .ఐ .ఇంజనీర్ -3 7995010108
7 ఎం .ఐ .ఇంజనీర్ -4 7995556227
8 ఎం .ఐ .ఇంజనీర్ -5  7995078264
9 ఎం.ఐ.క్రాప్ కో – అర్దినటర్-1 7995010109
10 ఎం.ఐ.క్రాప్ కో – అర్దినటర్ – 2 7995010110
11 ఎం.ఐ.క్రాప్ కో – అర్దినటర్-3 7995078271
12 ఆఫీస్ ల్యాండ్ లైన్ నెంబర్ 08518 – 279724

ప్రాజెక్ట్ డైరెక్టర్
ఎ పి ఎం ఐ పి – కర్నూల్