లీగల్ మెట్రాలజీ

లీగల్ మెట్రాలజీ శాఖ యొక్క ప్రధాన విధులు – బాధ్యతలు

  • లీగల్ మెట్రాలజీ శాఖకు ఈ క్రింద పేర్కొన్న చట్టములను మరియు నియమములను అమలు చేయుట ప్రధాన కర్తవ్యం :-

  1.  లీగల్ మెట్రాలజీ యాక్టు, 2009.
  2. లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్ రూల్స్, 2011.
  3. ఆంధ్రప్రదేశ్ లీగల్ మెట్రాలజీ (ఎన్ఫోర్స్ మెంట్) రూల్స్, 2011.
  4. ఎడిబుల్ ఆయిల్ రెగ్యులేషన్ యాక్టు.
  • తూనికలు, కొలతల పరికరాలు సరిచూచుట  :-

తూనికలు, కొలతల పరికరములు ఉపయోగించు ప్రతి వ్యక్తి / సంస్థ విధిగా వారి వారి పరికరములను నిర్ణీత సమయములో తూనికలు, కొలతల శాఖ వద్ద సమర్పించి సదరు పరికరములు నిర్ణీత ప్రమాణములకు అనుగుణంగా సరిచేయించుకొని ముద్రలు వేయించుకొనవలెను.  తూనికలు, కొలతల పరికరములపై సరియిన ముద్రలు లేకుండా వినియోగించడం / కలిగి ఉండడము చట్టారీత్యా నేరము.

 

తనిఖీలు :-

ఈ క్రింద పేర్కొనిన అంశాలకు సంబంధించి తూనికలులు కోలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించేదరు :

  1.  తూనికలు, కొలతలు ప్రామాణీకమా? కాదా?
  2.  సకాలములో సరిచూచబడినవా? లేదా?
  3. సదరు పరికరముల ద్వారా ఖచ్చితమైన పరిమాణాలను ఇచ్చుచున్నారా? లేదా?

పైన తెలిపిన అంశములలో ప్రామాణిక లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్, 2011 ప్రకారంగా ముందుగా ప్యాక్ చేయబడిన సరుకులు ఈ క్రింద తెలిపిన వివరములు ముద్రించునప్పుడు సదరు తయారీదారులు / అమ్మకందారులపై తూనికలు కోలతల శాఖ వారిచే తగు చర్యలు చేపట్టబడును.

  1. మీరు కొన్న లేక మీకు చేర్చిన సరుకు పేర్కొన్న దాని కంటే తక్కువ బరువు ఉన్నప్పుడు
  2. ప్యాకేజీ పైన సరుకు పేరు , దాని పరిమాణం, తయారు తేదీ, చిల్లర అమ్మకపు ధర వంటి ముఖ్యమైన సమాచారం పొందుపరచనప్పుడు.
  3. ప్యాకేజీ పైకి నమ్మించేలా కనపడి, దానిపైన పేర్కొన్న దాని కన్నా తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు
  4. విలువైన నగలు, రత్నాలను ఉత్తమ ప్రామాణిక తూనికలను కాకుండా విక్రయించినప్పుడు,
  5. ప్యాకేజీపై ముద్రించిన ధరను వ్యాపారస్తునికి అనుకూలంగా చెరపడం, మరకవేయడం లేదా మార్చడం చేసినప్పుడు
  6. ప్రామాణిక బరువు లేదా కొలతను వాడకుండా సరుకును అమ్మినప్పుడు.
  7. ఇనుము టి.ఎం.టి. బార్ల వంటి ఘనా పదార్తలను బరువుపైన కాకుండా సంఖ్యాపరంగా అమ్మినప్పుడు.
  8. దిగుమతి అయిన సరుకుల ప్యాకేజీపై దిగుమతిదారుని పేరు, సరుకుల పరిమాణము మరియు చిల్లర అమ్మకపు ధర తయారైన నెల, సంవత్సరం వంటి వివరాలు లేనప్పుడు
  9. ప్యాకేజీలపై గరిష్ట చిల్లర ధరను మార్చగలిగే విధంగా వేర్వేరు స్టిక్కర్లు అతికించి ఉన్నప్పుడు
  10. పెట్రోలు, డీజిల్ సరఫ్రా చేసే పెట్రోలు పంపు కొలత ప్రమాణం సరిచూసుకొనడానికి వీలుగా ఐదు లీటర్ల పరీక్షా కొలసాధనం సమకూర్చలేనప్పుడు.
  11. ఒక వస్తువు ప్రకటితమైన గరిష్ట రిటైలు ధర కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నప్పుడు
  12. ఫిర్యాదుల నిమిత్తం వినియోగదారులు సంప్రదించుట కొరకు ప్యాకేజీపై వినియోగదారుల సంరక్షణ వివరములు ఫోను నంబరుతో సహా ముద్రించనప్పుడు.

 

పైన తెలిపిన విధులతో బాటు :-

  • అందుబాటులో ఉన్న ఫిర్యాదుల పరిష్కార యంత్రాగాన్ని ఉపయోగించుకొనేలా వినియోగదారులకు సాధికారికతను సమకూర్చడం.
  • వినియోగదారులకు తమ హక్కులు, విధులపై అవగాహన సంపాధించటం తూనికలు కొలతల శాఖ యొక్క ప్రధాన బాధ్యతలు.

 

అధికారుల వివరాలు
సం లీగల్ మెట్రాలజీ అధికారి పేరు హోదా మోబైల్ నెంబర్
1 శ్రీ. యం. గోపికృష్ణా రెడ్డి ఉప నియంత్రకులు, లీగల్ మెట్రాలజీ,

కర్నూలు.

9440429961
2 శ్రీ యం. జిలాని భాష అసిస్టెంట్ కంట్రోలర్,

లీగల్ మెట్రాలజీ, కర్నూలు – I & II

9398162877
3 శ్రీ. జే. మొహమ్మద్ పరిశీలకులు, లీగల్ మెట్రాలజీ,

ఆదోని, కర్నూలు & డోన్.

9398163957
4 శ్రీ పి.వి. యం. పరమేశ్వర కుమార్ I/c పరిశీలకులు,

లీగల్ మెట్రాలజీ, నంద్యాల.

9398115091