ముగించు

వయోజన విద్య

వయోజన విద్యా శాఖ ఆద్వర్యంలో సాక్షర భారత కార్యక్రమం ద్వారా ఈ క్రింది కార్యక్రమాలు నిర్వహించబడుచున్నవి.

  • సాక్షర భారత్ కార్యక్రమాన్ని భారత ప్రధాన మంత్రి 2009 సెప్టెంబర్ 8 న దేశవ్యాప్తంగా ప్రారంభించారు.
  • మన రాష్ట్రంలో 2010 సెప్టెంబర్ 8 న అతర్జాతీయ అక్షరాస్యత దినోత్సవం   సందర్భంగా  రాష్ట్ర గవర్నర్ గారిచే సాక్షర భారత్ కార్యక్రమం ప్రారంభించబడి౦ది.

కర్నూలు జిల్లాలో అదే రోజున (2010 సెప్టెంబర్ 8)   ప్రారంభించబడి౦ది.

సాక్షర భారత్ ప్రధాన లక్ష్యాలు :

  1. ప్రాధమిక అక్షరాస్యత కార్యక్రమం
  2. ప్రాధమిక విద్య
  3. నిరంతర విద్య కార్యక్రమం
  4. వృత్తి విద్య కార్యక్రమం

జిల్లా లోని 15సం,,లు పై బడిన నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేయుటయే ప్రాధమిక అక్షరాస్యత కార్యక్రమం. సాక్షర భారత్ సర్వే ప్రకార౦ జిల్లాలో 11,33,888 మంది నిరక్షరాస్యులున్నారు.

ఇప్పటి వరకు 7దశలలో అక్షరాస్యతా కార్యక్రమంలో 7,11,010 మంది వయోజనులు నమోదు కాగా, 558565 మ౦ది అక్షరాస్యులైనారు. శ్రీయుత సంచాలకుల వారి ఆదేశానుసారం    21-10-2016 తేదీన ప్రారంభించిన 7వ దశ అక్షరాస్యత కార్యక్రమం ఆగస్టు 2017 న పూర్తి అయినది. ప్రస్తుతం శ్రీయుత జిల్లా కలెక్టరు గారి ఆదేశానుసారం లక్ష మంది నిరక్షరాస్యుల మహిళలకు 100 రోజులలో అక్షరాస్యతా కల్పించుటకు గ్రామ సమన్వయ కర్తలు, సాధికార మిత్రల ద్వారా 14-04-2018 అంబేద్కర్ జయంతి సందర్భంగా జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాన్ని ప్రారంభించడమైనది. ఇట్టి కార్యక్రమానికి స్వయం సహాయక సంఘాలు, ప్రజాప్రతినిధులు, అన్ని శాఖల అధికారులను, స్వచ్చంద సంస్థల సహకారం కోరడమైనది.

జాతీయ సార్వత్రిక పాఠశాల (NIOS), జాతీయ అక్షరాస్యతా మిషన్ వారిచే అక్షరాస్యత కేంద్రాల్లో అక్షరాస్యులైన వారికి మరియు గ్రామాలలో 1,2 తరగతులు చదివి, చదువు మధ్యలో మానివేసిన వారికి విద్యార్హత తెలియచేసే ఏ ధ్రువపత్రం లేని వారి గురించి ప్రతి సంవత్సరం మార్చి, ఆగష్టు మాసములలో పరీక్షలు నిర్వహించడం జరుగుచున్నది. 16వ విడత NIOS పరీక్ష 25-03-2018 తేదిన 3115 మందికి నిర్వహి౦చగా అందరు హాజరయ్యారు.

జిల్లాలో 2010 నుండి ప్రతి గ్రామ పంచాయతీలో ఒక వయోజన విద్యా కేంద్రము(AEC) నిర్వహించబడుచున్నది. జిల్లాలో 889 గ్రామ ప౦చాయతీల నందు 5,31,600 మంది లబ్దిదారులు నమోదైనారు. ప్రతి వయోజన విద్యా కేంద్రమునకు ప్రభుత్వము వారు నూతన అక్షరాస్యుల కొరకు  వివిధ రకాల (వంటలు, రంగవల్లికలు, కధలు, పాడి పంటలు, ఆరోగ్యము మొదలగు అ౦శములతో కూడినవి) పుస్తకములు, ఆట వస్తువులు,(క్యారం బోర్డు, చెస్ బోర్డు, చైనీస్ చక్కర్, కైలాస పటం, స్కిప్పింగ్ రోప్స్), 10 కుర్చీలు, కార్పెట్, కుట్టు మిషన్ మొదలగునవి సామాగ్రి సరఫరా చేసియున్నారు.

జిల్లాకు 6 ఆదర్శ వయోజన విద్యా కేంద్రములు (Model AEC)  పవర్ ఫైనాన్స్ కార్పోరేషన్ వారి సహకారంతో ప్రభుత్వం మంజూరు చేసినది. ప్రతి ఆదర్శ వయోజన విద్యా కేంద్రమునకు 5 కుట్టు మిషన్ లు, షుగర్, బి.పి., వేయింగ్ మిషన్, 30 కుర్చీలు, టేబుళ్లు, కంప్యూటర్, ప్రొజెక్టర్ & స్క్రీన్  సరఫరా చేయబడినవి. ఆదర్శ వయోజన విద్యా కేంద్రములలో కంప్యూటర్, టైలరింగ్ కోర్సులలో నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమాలు నిర్వహి౦చబడినవి.

జిల్లాలోని 6 ఆదర్శ వయోజన విద్యా కేంద్రములలో నైపుణ్యాభివృద్ది శిక్షణా కార్యక్రమాలలో భాగంగా కంప్యూటర్, టైలరింగ్ కోర్సులలో 90 రోజుల పాటు  శిక్షణ తరగతులు నిర్వహి౦చబడినవి. ప్రతి కోర్సు నందు 20 మందిని నమోదు చేసుకొని శిక్షణా తరగతులు  23-01-2017 నుండి నిర్వహించబడినవి. శిక్షణా తరగతులు నిర్వహించే ట్యూటర్స్ కు ప్రతి రోజు రూ.130/- లు గౌరవ వేతనము చెల్లించబడినవి. ఈ కార్యక్రమం 90 రోజులు వ్యవధి పూర్తి అయిన౦దున కోర్సు ముగింపు చేయడమైనది.

ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు సాక్షర భారత్ కార్యక్రమం 31-03-2018 న ముగిసినది. తదుపరి ఉత్తర్వుల ప్రకారం కార్యక్రమం నిర్వహించబడును.

సిబ్బంది వివరాలు
క్ర.సo అధికారి పేరు హోదా మొబైల్ నెo
1 వై.యన్.జయప్రద ఉపసంచాలకులు 9849909213
2 బి.శ్రీనివాసుల రెడ్డి సహాయ సంచాలకులు 9581918838
3 యస్.ప్రభాకర రెడ్డి సహాయ ప్రాజెక్ట్ అధికారి 08518-277253
4 యం.వి.సుబ్బా రెడ్డి సహాయ ప్రాజెక్ట్ అధికారి 9177191859

 

ఉప సంచాలకులు,
వయోజన విద్య, కర్నూలు.