ముగించు

భూగర్భ జల మరియు జల గణన

పరిచయం

జల వనరులు – మైనర్ ఇరిగేషన్  క్రింద భూగర్భ జల మరియు జల గణన శాఖ (భూగర్భ జల శాఖ) మార్చి -1971 సంవత్సరములో నెలకొల్పబడినది. భూగర్భ జల శాఖ జరుపు కార్యక్రమాలన్నీ సంచాలకులు,భూగర్భ జల శాఖ  రాష్ట్ర రాజధాని  వారి  ఆధ్వర్యములో జరుగును.

సంస్థాగత నిర్మాణ క్రమము

organogram

భూగర్భ జల శాఖ నిర్వహించు కార్యక్రమములు :

  1.  ముఖ్యంగా త్రాగు నీరు,వ్యవసాయము  మరియు పరిశ్రమల కొరకు కొత్తగా  బోరు బావులు త్రవ్వుటకు అనువైన స్థలములు ఎంపిక జరుపబడును
  2.  మైనర్ ఇరిగేషన్ ప్రోగ్రాం క్రింద వివిధ సంస్థలు అనగా ఆర్.డబ్లు.ఎస్, పరిశ్రమలు, షెడ్యూల్డు కులములు , షెడ్యూల్డు తెగలు, వెనుకబడిన  కులములు సంబంధించిన కార్పోరేషన్లు, డి.ఆర్.డి.ఎ., డి.డబ్లు.యం.ఏ, జల వనరుల శాఖ, వ్యవసాయ, పండ్ల తోటలు, సేరికల్చర్, ఎ.పి.యం.ఐ.పి మొదలగు సంస్థలు బలహీన వర్గాలైన సన్నకారు మరియు మార్జినల్ రైతులకు చేపట్టబడే కార్యక్రమాలకు అనుసంధానకర్తగా వ్యవహరింపబడును.
  3. షెడ్యూల్డు కులములు , షెడ్యూల్డు  తెగలు వారికీ షెడ్యుల్డ్ కులముల సబ్ ప్లాను  , షెడ్యుల్డ్ తెగల సబ్ ప్లాను ప్రోగ్రాము నందు బోరు బావుల డ్రిల్లింగ్ జరపబడుచున్నది.
  4.  స్యాండు మైనింగు మరియు వల్టా చట్టము క్రింద బోరు బావుల కొరకు సాంకేతిక ఫీజబులిటీని ఇవ్వబడుచున్నది.
  5.  ప్రతి నెల పరిశీలక బావుల నుండి నీటి కొలతలు మరియు సంవత్సరము  నందు రెండు సార్లు నీటి మచ్చులు పూర్తి విశ్లేషణ కొరకు ఋతుపవనాల ముందు తరువాత సేకరించబడును.
  6.  జిల్లాలోని 147 ఫిజోమీటర్ల నుంచి ఆటోమాటిక్ వాటర్ లెవెల్ రికార్డరు మరియు టెలిమెట్రి ద్వారా ప్రతి గంటకు నీటి మట్టములు, నిరంతరముగా సేకరించబడుచున్నది.ఈ దతాంశమును ఎప్పటికప్పుడు సిఎం కోర్ డాష్ బోర్డు వెబ్ అడ్రస్సు ద్వారా తెలుసుకొనవచ్చును . ప్రతి గ్రామము నందు భుగార్భ జల లభ్యము, వినియోగము, భావిష్యత్ నకు మిగులు జలముల అంచనా  వేయబడును.
  7.  ప్రభుత్వం జి.ఓ.నం.06, పంచాయితీ రాజ్ మరియు రూరల్ డెవవలప్ మెంట్.(ఆర్ డి.2) డిపార్టుమెంటు తేది: 25.01.2018 ద్వారా 56 గ్రామాలు అతినీటి వినియోగ స్థాయి గ్రామాలుగా నోటిపై చేయబడినవి.ఈ గ్రామాలలో త్రాగునీటికీ  మినహా , ఇతరములకు బోరుబావులు వేయుట నిషేదించడమైనది.

Office buildingwater lab

ఇంక్యుమ్బెంట్స్ యొక్క చిరునామాలు                                                                                                                                       వాటర్ క్వాలిటీ ల్యాబ్ లెవల్– II,బీ.తాండ్రపాడు,కర్నూలు

బీ.గోపాల్, యం ఎస్ సి,
డిప్యూటీ డైరెక్టర్,
భూగర్భ జలలు మరియు జల గణన శాఖ,
ఎఫ్ అర్ ఎల్  సమ్మేళనం, ఎ- క్యాంపు,
విజయా మిల్క్ డైరీ దగ్గర,
కర్నూలు -518002

సెల్: 8333991261
ఆఫీస్  నెంబర్: 08518-255923
ఈ మెయిల్:ddgwdknl[at]gmail[dot]com,    ddgwdknl[at]rediffmail[dot]com