లీగల్ మెట్రాలజీ
లీగల్ మెట్రాలజీ శాఖ యొక్క ప్రధాన విధులు – బాధ్యతలు
-
లీగల్ మెట్రాలజీ శాఖకు ఈ క్రింద పేర్కొన్న చట్టములను మరియు నియమములను అమలు చేయుట ప్రధాన కర్తవ్యం :-
- లీగల్ మెట్రాలజీ యాక్టు, 2009.
- లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్ రూల్స్, 2011.
- ఆంధ్రప్రదేశ్ లీగల్ మెట్రాలజీ (ఎన్ఫోర్స్ మెంట్) రూల్స్, 2011.
- ఎడిబుల్ ఆయిల్ రెగ్యులేషన్ యాక్టు.
-
తూనికలు, కొలతల పరికరాలు సరిచూచుట :-
తూనికలు, కొలతల పరికరములు ఉపయోగించు ప్రతి వ్యక్తి / సంస్థ విధిగా వారి వారి పరికరములను నిర్ణీత సమయములో తూనికలు, కొలతల శాఖ వద్ద సమర్పించి సదరు పరికరములు నిర్ణీత ప్రమాణములకు అనుగుణంగా సరిచేయించుకొని ముద్రలు వేయించుకొనవలెను. తూనికలు, కొలతల పరికరములపై సరియిన ముద్రలు లేకుండా వినియోగించడం / కలిగి ఉండడము చట్టారీత్యా నేరము.
తనిఖీలు :-
ఈ క్రింద పేర్కొనిన అంశాలకు సంబంధించి తూనికలులు కోలతల శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించేదరు :
- తూనికలు, కొలతలు ప్రామాణీకమా? కాదా?
- సకాలములో సరిచూచబడినవా? లేదా?
- సదరు పరికరముల ద్వారా ఖచ్చితమైన పరిమాణాలను ఇచ్చుచున్నారా? లేదా?
పైన తెలిపిన అంశములలో ప్రామాణిక లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) రూల్స్, 2011 ప్రకారంగా ముందుగా ప్యాక్ చేయబడిన సరుకులు ఈ క్రింద తెలిపిన వివరములు ముద్రించునప్పుడు సదరు తయారీదారులు / అమ్మకందారులపై తూనికలు కోలతల శాఖ వారిచే తగు చర్యలు చేపట్టబడును.
- మీరు కొన్న లేక మీకు చేర్చిన సరుకు పేర్కొన్న దాని కంటే తక్కువ బరువు ఉన్నప్పుడు
- ప్యాకేజీ పైన సరుకు పేరు , దాని పరిమాణం, తయారు తేదీ, చిల్లర అమ్మకపు ధర వంటి ముఖ్యమైన సమాచారం పొందుపరచనప్పుడు.
- ప్యాకేజీ పైకి నమ్మించేలా కనపడి, దానిపైన పేర్కొన్న దాని కన్నా తక్కువ పరిమాణంలో ఉన్నప్పుడు
- విలువైన నగలు, రత్నాలను ఉత్తమ ప్రామాణిక తూనికలను కాకుండా విక్రయించినప్పుడు,
- ప్యాకేజీపై ముద్రించిన ధరను వ్యాపారస్తునికి అనుకూలంగా చెరపడం, మరకవేయడం లేదా మార్చడం చేసినప్పుడు
- ప్రామాణిక బరువు లేదా కొలతను వాడకుండా సరుకును అమ్మినప్పుడు.
- ఇనుము టి.ఎం.టి. బార్ల వంటి ఘనా పదార్తలను బరువుపైన కాకుండా సంఖ్యాపరంగా అమ్మినప్పుడు.
- దిగుమతి అయిన సరుకుల ప్యాకేజీపై దిగుమతిదారుని పేరు, సరుకుల పరిమాణము మరియు చిల్లర అమ్మకపు ధర తయారైన నెల, సంవత్సరం వంటి వివరాలు లేనప్పుడు
- ప్యాకేజీలపై గరిష్ట చిల్లర ధరను మార్చగలిగే విధంగా వేర్వేరు స్టిక్కర్లు అతికించి ఉన్నప్పుడు
- పెట్రోలు, డీజిల్ సరఫ్రా చేసే పెట్రోలు పంపు కొలత ప్రమాణం సరిచూసుకొనడానికి వీలుగా ఐదు లీటర్ల పరీక్షా కొలసాధనం సమకూర్చలేనప్పుడు.
- ఒక వస్తువు ప్రకటితమైన గరిష్ట రిటైలు ధర కన్నా ఎక్కువ ధరకు అమ్ముతున్నప్పుడు
- ఫిర్యాదుల నిమిత్తం వినియోగదారులు సంప్రదించుట కొరకు ప్యాకేజీపై వినియోగదారుల సంరక్షణ వివరములు ఫోను నంబరుతో సహా ముద్రించనప్పుడు.
పైన తెలిపిన విధులతో బాటు :-
- అందుబాటులో ఉన్న ఫిర్యాదుల పరిష్కార యంత్రాగాన్ని ఉపయోగించుకొనేలా వినియోగదారులకు సాధికారికతను సమకూర్చడం.
- వినియోగదారులకు తమ హక్కులు, విధులపై అవగాహన సంపాధించటం తూనికలు కొలతల శాఖ యొక్క ప్రధాన బాధ్యతలు.
సం | లీగల్ మెట్రాలజీ అధికారి పేరు | హోదా | మోబైల్ నెంబర్ |
---|---|---|---|
1 | శ్రీ. యం. గోపికృష్ణా రెడ్డి | ఉప నియంత్రకులు, లీగల్ మెట్రాలజీ,
కర్నూలు. |
9440429961 |
2 | శ్రీ యం. జిలాని భాష | అసిస్టెంట్ కంట్రోలర్,
లీగల్ మెట్రాలజీ, కర్నూలు – I & II |
9398162877 |
3 | శ్రీ. జే. మొహమ్మద్ | పరిశీలకులు, లీగల్ మెట్రాలజీ,
ఆదోని, కర్నూలు & డోన్. |
9398163957 |
4 | శ్రీ పి.వి. యం. పరమేశ్వర కుమార్ | I/c పరిశీలకులు,
లీగల్ మెట్రాలజీ, నంద్యాల. |
9398115091 |