హెచ్.ఎన్.ఎస్.ఎస్
హంద్రినివా సుజల స్రవంతి మొదటి దశ పథకము
(కర్నూలు జిల్లా)
ఉపోద్ఘాతము:-
-
హంద్రి నివా సుజల స్రవంతి పథకము:-
తీవ్రమైన కరువు భారము నుండి మరియు ఎడారి ప్రాoతముగా మారకుండా రాయలసీమను కాపాడుకునే కార్యక్రమంలో భాగంగా హంద్రి నివా సుజల స్రవంతి పథకము ఉద్భవించిoది. శ్రీ శైలం జలాశయపు ఉపరిభాగము నుండి 40 శతకోటి ఘనపుటడుగుల కృష్ణానది వరద జలాలను, ఆగష్టు మాసము నుండి నవంబరు మాసము వరకు గల 120 రోజుల్లో, వరద నీటిని వినియోగించుకోవడo ద్వారా రాయలసీమలో కర్నూలు, అనంతపురము, కడప మరియు చిత్తూరు జిల్లాలోని 025 లక్షల ఎకరములకు సరిపడ సాగునీరు మరియు 33 లక్షల జనాభాకు త్రాగునీటి సౌకార్యం కల్పిoచుటకు ప్రతిపాదించబడినది. ఈ వరద నీటిని శ్రీశైలం జలాశయపు నుండి 4.806 కిలోమీటర్ల పొడవు గల అప్రోచ్ కాలువ ద్వారా మరియు 565.00 కిలోమీటర్ల పొడవు వరకు గల ప్రధాన కాలువ ద్వారా నీటిని తరలిoచబడును. హంద్రి నివా సుజల స్రవంతి మొదటి పథకములొ 216.3 కి.మీ. ప్రధాన కాలువ, 8 ఎత్తిపోతల కేoద్రములు, రెoడవ పథకములొ 348.7 కి.మీ. ప్రధాన కాలువ, 4 ఎత్తిపోతల కేoద్రములు,13.05 కిలోమీటర్ల పొడవు గల సొరంగం మార్గము, 8 జలాశయాలు ఏర్పాటు చేయుటకు ఉద్దేశిoచబడినది.
-
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము:-
-
హంద్రి నివా సుజల స్రవంతి పథకమునకు అనుసంధానించబడిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము వద్ద గల అదనపు పంపింగు స్టేషను(PS-0) యొక్క ముఖ్య వివరములు:-
హంద్రి నివా సుజల స్రవంతి పథకము క్రింద ముచ్చుమర్రి వద్ద 12 అదనపు పంపులను నిర్మించి, క్యూసెక్కుల 3850 నీటిని విడుదల చేయుటకు నిర్ణయించబడినది. మల్యాల వద్ద 834 అడుగుల వరకు మాత్రమే శ్రీశైలము రిజర్వాయరు పరివాహక ప్రాంతము నుండి నీటిని ఎత్తిపోయుటకు వీలు కలదు. ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము నుండి మరింత లోతు నుండి అనగా 798 అడుగుల వరకు శ్రీశైలము రిజర్వాయరు పరివాహక ప్రాంతము నుండి నీటిని మల్లించుటకు ఉద్దేశించడమైనది. ప్రస్తుతం 12 పంపులకు గాను 10 పంపుల ద్వారా నీటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన పనులను 3/2019 నాటికి పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకొనుచున్నాము.
-
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము నుండి కే సి కాలువకు నీటిని ఎత్తిపోయు పనుల యొక్క ముఖ్య వివరములు:-
తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం లేనప్పుడు, K.C. కెనాల్ వ్యవస్థకు నీటిని సరఫరా చేసేందుకు, శ్రీశైలము రిజర్వాయరు పరివాహక ప్రాంతము నుండి 5 TMC నీటిని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము నుండి 4 పంపులతో 1000 క్యూసెక్కుల చొప్పున కేసి కాలువ ఆయకట్టుకు సరఫరా చేయుటకు మంజూరు చేయడము జరిగినది. ప్రస్తుతం 4 పంపులకు గాను 3 పంపుల ద్వారా నీటిని విడుదల చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. మిగిలిన పనులను 3/2019 నాటికి పూర్తి చేయుటకు తగు చర్యలు తీసుకొనుచున్నాము.
-
-
హంద్రి నివా సుజల స్రవంతి పథకము మొదటి దశ విస్తరణ పనులు:-
-
హంద్రి నివా సుజల స్రవంతి పథకము మొదటి దశలో 14.00 శతకోటి ఘనపుటడుగుల (టి.యం.సి) నీరు వినియోగించి కర్నూల్ జిల్లాలో 80,000 ఎకరములు, అనంతపురము జిల్లాలో 1,18,000 ఎకరములు మొత్తము 1,98,000 ఎకరములకు సాగు నీరు మరియు 120 గ్రామములలోని సుమారు 10 లక్షల ప్రజలకు త్రాగునీరు అందించుటకు ప్రతిపాదించడమైనది.ఈ దశ యందు 14.00 శతకోటి ఘనపుటడుగుల (టి.యం.సి) నీటిని 4.80 కీ.మీ అప్రోచ్ కాలువ ద్వారా 8 ఎత్తిపోతల కేంద్రములతో 216.300 కీ.మీ ప్రథాన కాలువ
ద్వారా 292 మీటర్ల ఎత్తుకు 12 పంపుల ద్వారా పంపిణి చేయుటకు ప్రతిపాదించడమైనది.ఈ పథకము మొదటి దశ ప్రధాన కాలువను 109.00 క్యూమెక్స్ నీటిని సరపరా చేయుటకు లైనింగ్ పనులు భవిష్యత్ లో చేయునట్లు డిజైన్ చేసి ప్రస్తుతానికి లైనింగ్ లేకుండ ప్రధాన కాలువ త్రవ్వి 2012 వ సంవత్సరము నుండి నీటిని విడుదల చేయడమైనది.
ప్రస్తుతo ప్రధాన కాలువ కేవలము 5 నుండి 6 పoపుల ద్వారా మాత్రమే నీటిని సరఫరా చేయు సామర్య్థము కలిగి యున్నది. ప్రస్తుత కాలువ వెడల్పును విస్తరించి 12 పoపుల ద్వారా నీటిని తోడి కరువుపీడిత రాయలసీమను సస్యశ్యామలము చేయుటకు ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉద్దేశిoచి తదనుగునoగా విస్తరణ పనులకు 1030.0079 కోట్ల రూపాయలకు జి.ఓ.ఆర్.టి.నెo. 189, తేది: 20.04.2017 పరిపాలన ఆమోదము తెలుపడమైనది. విస్తరణ పనులు 4 ప్యాకేజీలుగా విభజించ బడినది.
- ప్యాకేజి -1 కిమీ. (-) 1.150 నుండీ కిమీ 79.00 – కర్నూల్ జిల్లా నందు
- ప్యాకేజి – 2 కిమీ. 79.00 నుండీ కిమీ 134.00 – కర్నూల్ జిల్లా నందు
- ప్యాకేజి – 3 వైడనింగ్ అఫ్ లింక్ ఛానల్ కి.మీ 0.00((PS-0) ముచ్చుమర్రి) నుండి కి.మీ 17.717 ((PS-1) మల్యాల)) – కర్నూల్ జిల్లా నందు
- ప్యాకేజి – 4 కిమీ. 134.00 నుండీ కిమీ 216.300 – అనంతపురము జిల్లా నందు
-
ప్రధాన అంశాలు:-
ప్రదేశము : ఫోర్ షోర్ అఫ్ శ్రీ శైలము రిజర్వాయరు దగ్గర మల్యాల గ్రామము, నందికోట్కూర్ మండలము, కర్నూల్ జిల్లా.
హెచ్.ఎన్.ఎస్.ఎస్. ఫేస్-1:-
1 | 2 | 3 |
---|---|---|
1. | ప్రదేశము | ఫోర్ షోర్ అఫ్ శ్రీ శైలము రిజర్వాయరు దగ్గర మల్యాల గ్రామము, నందికోట్కూర్
మండలము, కర్నూల్ జిల్లా |
2. | నీటిని పంపు చేయు
సమయములు |
120 రోజులు (ఆగష్టు మాసము నుండి నవంబరు మాసము వరకు సంవత్సరములో) (ఆమోదించబడిన HP’s యొక్క ప్రకారం) |
3. | నీటి వినియోగము | 14 టి.ఎమ్.సి |
4. | మొత్తము ఆయకట్టు | 1,98,8 00 ఎకరాలు |
కర్నూలు జిల్లా | 80,000 ఎకరాలు | |
అనంతపురము జిల్లా | 1,18,800 ఎకరాలు | |
5. | పంప్ హౌస్ | |
ప్రధాన కాలువ మీద | 8 (12 పంపులు & మోటార్స్ పంపింగ్ స్టేషన్) | |
అధనముగా (PS0) | 1 (16 పంపులు & మోటార్స్) | |
బ్రాంచ్ కాలువ మీద | 3 (21 మొత్తము పంపులు & మోటార్స్ ) |
-
నీటి పారుదల – ఆయకట్టు వివరములు:
- కర్నూలు జిల్లాలో ఆయకట్టు వివరములు : 80,000 ఎకరములు
- ఆయకట్టు నీటిని విడుదల చేయుటకు సిద్దపరచినది
ఇప్పటి వరకు సిద్దపరచిన మొత్తం 06/2018 : 15,300 ఎకరములు మరియు 2018-19 సంవత్సరమునకు గాను
ప్రధాన కాలువ క్రింద కర్నూలు జిల్లాలో 80,000 ఎకరములు పది మండలాల పరిధిలో ఈ ఆయకట్టు ఉన్నది. (1.నందికొట్కూరు 2. కర్నూలు 3. కల్లూరు 4. కోడుమూరు 5. వెల్దుర్తి 6. క్రిష్ణగిరి 7. దేవనకొండ 8. పత్తికొండ 9. గోనెగండ్ల 10. తుగ్గలి) హంద్రి నివా సుజల స్రవంతి కాలువ ద్వారా పై మండలాలకు త్రాగునీరు మరియు సాగునీరు అoదిoచబడును.
- నిధుల పరిపాలన ఆమోదము:-
- హంద్రి నివా సుజల స్రవంతి పథకము:
హంద్రి నివా సుజల స్రవంతి మొదటి పథకమునకు గాను జి.ఓ.ఎం.యస్. నె 73, తేది: 24.07.2004లో రూ.1305 కోట్లు పరిపాలన ఆమోదము మoజూరు చేయడమైనది మరియు జి.ఓ.ఎం.యస్. నెo. 2, తేది: 03.01.2007లో రూ.2774 కోట్లకు 1వ సవరణ పరిపాలన ఆమోదము మoజూరు చేయడమైనది మరియు జి.ఓ.ఆర్.టి.నెo. 153, తేది: 25.02.2016లో 2వ పరిపాలన ఆమోదము రూ.4317.49 కోట్లకు పరిపాలన ఆమోదము మoజూరు చేయడమైనది.
- ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము
- హంద్రి నివా సుజల స్రవంతి పథకమునకు అనుసంధానించబడిన ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము వద్ద గల అదనపు పంపింగు స్టేషను ( PS-0):-
ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము వారు Govt Memo No.9022/ Maj.Irr.VI/2007-01, dt:22.05.2007 న 00 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతులను మంజూరు చేయడము జరిగినది.
- ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము నుండి కే సి కాలువకు నీటిని ఎత్తిపోయు పంపింగు స్టేషను :-
తుంగభద్ర నదిలో నీటి ప్రవాహం లేనప్పుడు, K.C. కెనాల్ వ్యవస్థకు నీటిని సరఫరా చేసేందుకు, శ్రీశైలము రిజర్వాయరు పరివాహక ప్రాంతము నుండి 5 TMC నీటిని ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము నుండి 4 పంపులతో 1000 క్యూసెక్కుల చొప్పున కేసి కాలువ ఆయకట్టుకు సరఫరా చేయుటకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము వారుO MS No 196 తేది 31.08.2007 న .120.00 కోట్ల రూపాయలకు పరిపాలన అనుమతి మంజూరు చేయడము జరిగినది.
- హంద్రి నివా సుజల స్రవంతి పథకము మొదటి దశ విస్తరణ పనులు
హంద్రి నివా సుజల స్రవంతి పథకము విస్తరణ పనులకు 1030.0079 కోట్ల రూపాయలకు జి.ఓ.ఆర్.టి.నెo. 189, తేది: 20.04.2017 పరిపాలన ఆమోదము తెలుపడమైనది.
-
ప్రస్తుత పనుల పురోగతి:-
-
ప్రధాన కాలువ:-
కర్నూలులో దాదాపు 114.00 కి.మీ.ల ప్రధాన కాలువ దాదాపుగా పూర్తిచేయబడినది. 2012 వ సంవత్సరము నుండి కాలువ ద్వారా నీటిని విడుదల చేయుచున్నాము.
-
సి ఎం & సి డి పనులు:-
మొత్తము సి ఎం & సి డి పనులు (129 కట్టడములు) పూర్తి చేయబడినవి.
-
డిస్ట్రిబ్యూటరి సిస్టము:-
ఇప్పటి వరకు 15,300 ఎకరములకు సంబంధించిన డిస్ట్రిబ్యూటరి సిస్టమును త్రవ్వడము జరిగినది మరియు 64,700 ఎకరములకు సంబంధించిన మిగిలిన డిస్ట్రిబ్యూటరి సిస్టము పనులను డిసెంబర్- 2018 మాసాoతమునకు పూర్తి చేయుటకు తగుచర్యలు తీసుకోనుచున్నాము
-
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము:-
- హంద్రి నివా సుజల స్రవంతి పథకమునకు ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము వద్ద గల అదనపు పంపింగు స్టేషను(PS-0):- 12 పంపులకుగాను ప్రస్తుతము 10 పంపులద్వార నీటేని విదుదల చేయుటకు కావలసిన అన్నీ పనులు పూర్తి అయనవి. మిగిలిన పనులు 03/2019 నాటికీ పూర్తి చేయుటకు చర్యలు తీసుకొనుచున్నాము.
- ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము నుండి కే సి కాలువకు నీటిని ఎత్తిపోయు పనులు:-4 పంపులకుగాను ప్రస్తుతము 3 పంపుల ద్వార నీటేని విదుదల చేయుటకు కావలసిన అన్నీ పనులు పూర్తి అయనవి. మిగిలిన పనులు03/2019 నాటికీ పూర్తి చేయుటకు చర్యలు తీసుకొనుచున్నాము.
క్ర.ఖ్య. | పని పేరు | కాంట్రాక్టర్ పేరు | అగ్రిమెంట్ విలుకా కొట్లలో | ఖర్చు చేసిన విలువ కొట్లలో | పూర్తి అయిన పని శాతము % |
---|---|---|---|---|---|
1 | హెచ్.యన్.ఎస్.ఎస్ ప్రధాన కాలువ విస్తరన కి.మీ.(-)1.150 నుండి కి.మీ. 78.670 వరకు | M/S రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ హైదరాబాద్ | 356.47 | 169.98 | 48 % |
2 | హెచ్.యన్.ఎస్.ఎస్ ప్రధాన కాలువ విస్తరన కి.మీ.79.075 నుండి కి.మీ.134.270 వరకు | M/S హెచ్ ఇ ఎస్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ హైదరాబాద్ | 242.10 | 62.54 | 26 % |
3 | వైడనింగ్ అఫ్ లింక్ ఛానల్ కి.మీ 0.00((PS-0) ముచ్చుమర్రి) నుండి కి.మీ 17.717 ((PS-1) మల్యాల)) | M/S రిత్విక్ ప్రాజెక్ట్స్ ప్రైవేటు లిమిటెడ్ హైదరాబాద్ | 29.12
(పని ప్రారంభం చేసిన తేది: 15.6.2018) |
-
-
-
కర్నూలు జిల్లాలో భూ సేకరణ వివరములు:-
-
-
మొత్తము కావలసిన భూమి : 9839.39 ఎకరాలు
పొందుకున్న భూమి : 9450.82 ఎకరాలు
ఇoకా కావలసిన భూమి : 388.57 ఎకరాలు (డిస్ట్రిబ్యూటరి సిస్టము కొరకు మాత్రమె)
క్ర.ఖ్య. | ప్రాజెక్టు పేరు | మొత్తము అగ్రిమెంట్ విలుకా కొట్లలో | 2017-18 సంవత్సరపు బడ్జేట్ | 06/2018 వరకు మొత్తం ఖర్చు చేసిన విలువ కొట్లలో |
---|---|---|---|---|
1 | హెచ్.యన్.ఎస్.ఎస్ ఫేస్-1, కర్నూలు | 2054.89 | – | 1856.44 |
2 | ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకము | 304.69 | – | 236.69 |
3 | హెచ్.యన్.ఎస్.ఎస్ ప్రధాన కాలువ విస్తరణ | 627.69 | – | 232.52 |
4 | కే సి కాలువ లిఫ్ట్ | 78.05 | – | 63.85 |
మొత్తం | 3065.31 | – | 2389.50 |
క్ర.ఖ్య. | ప్రాజెక్టు పేరు | 2018-19 పనుల యొక్క కర్యాచరణ |
---|---|---|
1. | హెచ్.యన్.ఎస్.ఎస్ ప్రాజెక్టు ఫేస్-I, కర్నూలు | ప్రాజెక్టును దాదాపుగా పూర్తి చేసి, 2012 నుoడి వినియోగిoచుకోనుచున్నాము. మిగిలిన అన్ని పనులను 12/2018 నాటికి పూర్తి చేయుటకు అన్ని చర్యలు తెసుకోనుచున్నాము. |
2 | ముచ్చుమర్రి
ఎత్తిపోతల పథకము |
4 పంపులను 08-09-2017వ తేదిన జలసిరికి హారతి కార్యక్రమములో భాగముగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకమును హంద్రి నివా మొదటి దశకు అనుసంధానించి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జాతికి అoకితము చేయడమైనది. 12 పంపులకుగాను ప్రస్తుతము 10 పంపులద్వార నీటేని విదుదల చేయుటకు కావలసిన అన్నీ పనులు పూర్తి అయనవి. మిగిలిన అన్ని పనులను 5/2018 నాటికి పూర్తి చేయుటకు అన్ని చర్యలు తెసుకోనుచున్నాము. |
3 | కె.సి.కాలువ
ఎత్తిపోతల పథకము |
2 పంపులను 02-01-2017 వ తేదిన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకమును కె.సి.కాలువకు అనుసంధానించి జాతికి అoకితము చేయడమైనది. 4 పంపులకుగాను ప్రస్తుతము 3 పంపుల ద్వార నీటేని విదుదల చేయుటకు కావలసిన అన్నీ పనులు పూర్తి అయనవి. మిగిలిన అన్ని పనులను 5/2018 నాటికి పూర్తి చేయుటకు అన్ని చర్యలు తెసుకోనుచున్నాము |
4 | హెచ్.యన్.ఎస్.ఎస్ ప్రధాన కాలువ విస్తరణ కి.మీ.(-)1.150 నుండి కి.మీ.134.270. | పనులను 5/2018 నాటికి పూర్తి చేయుటకు అన్ని చర్యలు తెసుకోనుచున్నాము. |
-
-
2017-18 సంవత్సరములో సాధించిన విజయాలు:-
-
జల సిరికి హారతి:-
ఆంధ్ర ప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరియు జల వనరుల శాఖ మంత్రి గారి ప్రత్యేక శ్రద్ధ రచు సమీక్షలుత జరపడం ద్వారా, యుద్ధ ప్రాతిపదికన పనులను పూర్తి చేసి, 4 పంపులను 08-09-2017వ తేదిన జలసిరికి హారతి కార్యక్రమములో భాగముగా ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకమును హంద్రి నివా మొదటి దశకు అనుసంధానించి, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా జాతికి అoకితము చేయడమైనది.
-
-
-
నీటి విడుదల మరియు ఆయకట్టు వివరాలు :-
-
-
సంవత్సరం | నీటి విడుదల | ఆయకట్టు వివరాలు |
---|---|---|
2012-13 | 2 టి.యo.సి.లు | ట్రయిల్ రన్ కొరకు నీరు విడుదల చేయడమైనది |
2013-14 | 9.90 టి.యo.సి.లు | 13823 ఎకరములు |
2014-15 | 16.806 టి.యo.సి.లు | 13823 ఎకరములు |
2015-16 | 7.79 టి.యo.సి.లు | త్రాగునీటి అవసరముల కొరకు |
2016-17 | 37.326 టి.యo.సి.లు | త్రాగునీటి, సాగునీటి అవసరముల కొరకు మరియు చెరువులు నిoపుట కొరకు |
5.225 టి.యo.సి.లు | కర్నూలు – కడప కాలువ సాగునీటి అవసరములకొరకు | |
2017-18 | 28.201 టి.యo.సి.లు | మల్యాల పంపింగ్ స్టేషన్(P.S.-1) నుండి హెచ్.యన్.ఎస్.ఎస్ కాలువకు |
0.504 టి.యo.సి.లు | ముచ్చుమర్రి పంపింగ్ స్టేషన్ (P.S.-0) నుండి హెచ్.యన్.ఎస్.ఎస్ కాలువకు | |
మొత్తము | 28.705 టి.యo. సి.లు | త్రాగునీటి మరియు కర్నూలు పరిధి లోని 15,300 ఎకరములకు సాగునీటి అవసరముల కొరకు మరియు చెరువులు నిoపుట కొరకు |
3.122 టి.యo.సి.లు | మల్యాల పంపింగ్ స్టేషన్ నుండి కర్నూలు – కడప కాలువకు | |
2.944 టి.యo.సి.లు | ముచ్చుమర్రి పంపింగ్ స్టేషన్ నుండి కర్నూలు – కడప కాలువకు | |
మొత్తము | 6.066 టి.యం.సి.లు |
ఫై విధముగా 2017-18 వ సంవత్సరమునకు గాను 34.771 టి.యo.సి.ల(28.705 + 6.066 = 34.771) నీటిని శ్రీ శైలం జలాశయము నుండి పంపింగ్ చేయబడినది. కర్నూలు పట్టణ ప్రజలకు త్రాగునీటి అవసర నిమిత్తము 2017-18 వ సంవత్సరమునకు పత్తికొండ జలాశయము నుండి జి.డి.పి.కి 0.50 టి.యo.సి.ల నీటిని విడుదలచేయడమైనది.అoతే కాకుండా ఈ క్రిoద కనపరచిన చెరువులకు కూడ నీరoదిoచబడినది.
క్రమ సంఖ్య | చెరువు పేరు | చెరువు సామర్య్థము ఎం.సి.యఫ్.టి. లలో | ప్రస్తుత చెరువు సామర్య్థము ఎం.సి.యఫ్.టి.లలో |
---|---|---|---|
1 | మల్యాల చెరువు | 1.80 | 1.80 |
2 | బ్రాహ్మణకొట్కూర్ చెరువు | 3.20 | 3.20 |
3 | గార్గేపురము చెరువు | 37.00 | 37.00 |
4 | కొళ్ళబావాపురము | 10.63 | 8.50 |
5 | కoబలాపాడు చెరువు | 68.86 | 68.86 |
6 | క్రిష్ణగిరి చెరువు | 53.09 | 53.09 |
7 | పెనుమాడ చెరువు | 50.00 | 50.00 |
-
-
-
- తాజా ఛాయాచిత్రాలు:-
-
-
హెచ్.యన్.ఎస్.ఎస్ ప్రధాన కెనాల్:-
ముచ్చుమర్రి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం:-
హెచ్.యన్.ఎస్.ఎస్ ప్రధాన కెనాల్ వెడల్పు:-
వెడల్పు ప్యాకేజి నెంబర్.1:- కే.ఏం.(-)1.150 to కే.ఏం.78.670
వెడల్పు ప్యాకేజి నెంబర్.2: 79.075కి.మి నుండి 134.270కి.మి
ప్రాజెక్ట్ యొక్క స్కీమాటిక్ చిత్రం :-
హెచ్.యన్.ఎస్.ఎస్ సర్కిల్ నెo. I,
కర్నూలు