ముగించు

పట్టుపరిశ్రమ

భౌతిక  –  ఆర్థిక లక్ష్యాలు మరియు సాధించిన ప్రగతి

పట్టుపరిశ్రమ అనేది ఒక వ్యవసాయ ఆధారిత కుటీర పరిశ్రమ, ఇది వ్యవసాయ మరియు   వ్యవసాయేతర కార్యకలాపాలను కలిగి ఉంటుంది . కర్నూలు జిల్లాలో పట్టుపరిశ్రమ సుమారు 50 సంవత్సరంల నుండి సాగులో ఉంది. ప్రస్తుతం జిల్లాలో 46 మండలాల్లో 234 గ్రామాల్లో 1326 మంది రైతులు 2770.50 ఎకరాలలో పట్టు పరిశ్రమ సాగు చేస్తున్నారు. పట్టుపరిశ్రమ  ప్రధానంగా ఆత్మకూరు, పాములపాడు,కొత్తపల్లి,పత్తికొండ ,ధోన్ ,ప్యాపిలి ,తుగ్గలి ,వెల్దుర్తి ,బేతంచెర్ల మరియు యెమ్మిగనూరు మండలము లలో  సాగు చేస్తున్నారు. కోకన్ ఉత్పత్తి సంవత్సరమునకు 800 – 900 Mts నుండి ఉంటుంది. దీని మార్కెట్ విలువ సుమారు 28 కోట్లు. ఎకరానికి సాలుసరి రూ.1.00–1.50 లక్షలు ఆదాయం ఇస్తున్న పట్టుపరిశ్రమ చిన్న, సన్నకారు రైతులకు కల్పవృక్షం మరియు కుటుంబమంతా పాలుపంచుకునేందుకు వీలైన కుటీర పరిశ్రమ. సాలుసరి దాదాపు రూ. 1600 కోట్లు విలువ గల 500-550 మెట్రిక్ టన్నుల పట్టుగూళ్ళు జిల్లాలో ఉత్పత్తి జరుగుతున్నది. అతి తక్కువ వ్యవధి లోనే మొదటి పంట చేతికి రావడం (4 నెలలు) మరియు 65-70 రోజుల వ్యవధితో సంవత్సరానికి 4-5 పంటలు సాగు చేయగలగడం, ఒకసారి మల్బరీ నాటితే 10 నుండి 15 సంవత్సరాలు సాగుచేయగలగడం పట్టుపరిశ్రమ చేపట్టే రైతులకు సానుకూలించే విషయాలు.

 

శాఖా పరమైన భౌతిక లక్ష్యాలు ఇప్పటి వరకు సాధించిన  ప్రగతి(2018 – 19)
క్రమ సంఖ్య కార్యక్రమాలు

విస్తరణ కార్యక్రమములు

యూనిట్ లక్ష్యము ప్రగతి(జూన్- 2018  వరకు)
1 మల్బరీ విస్తీర్ణము ఎకరములు 450.00 67.50
2 నర్సరీ మొక్కల పెంపకం

ప్రభుత్వము రంగము

 

(లక్షల్లో)

3.00 2.000
ప్రైవేటు రంగము (లక్షల్లో) 26.700 17.900
3 పట్టు గూళ్ళ ఉత్పత్తి

సంకరజాతి

(మెట్రిక్  టన్నుల్లో) 1510.600 128.517
 

బైవోల్టిన్

(మెట్రిక్  టన్నుల్లో) 284.700 64.048
మొత్తము   1795.300 192.565

 

అమలులో వున్న ప్రభుత్వ అభివృద్ది పథకములు
పథకము అంశము యూనిట్ ధర ప్రభుత్వ రాయితీ రైతు వాటా
వార్షిక ప్రణాళిక మల్బరీ మొక్కల పెంపకము 14000 10500 3500
  విదేశీ  పట్టు గూళ్ళ ఉత్పత్తి పై ప్రోత్సాహకము 0 50 / Kg 0
  వ్యాధి నిరోధకాల సరఫరా 5000 3750 1250
  పట్టు చేనేత కార్మికులకు పట్టు దారం పై రాయితీ 1000 1000 0
  యాంత్రీకరణ ఐచ్చికము ననుసరించి 50 % లేదా రూ. 10000/- మించకుండా 50 % లేదా యూనిట్ ధరలో మిగిలిన మొత్తం
యస్.సి. సుబ్ ప్లాన్ మల్బరీ మొక్కల పెంపకము 14000 12600 1400
  రేరింగు గది నిర్మాణమునకు 400000 360000 40000
  వ్యాధి నిరోధకాల సరఫరా 5000 4500 500
  సేంద్రియ వ్యవసాయము 10000 9000 1000
ట్రైబల్ సబ్ ప్లాన్ మల్బరీ మొక్కల పెంపకము 14000 12600 1400
  రేరింగు గది నిర్మాణమునకు 400000 360000 40000
  వ్యాధి నిరోధకాల సరఫరా 5000 4500 500
  సేంద్రియ వ్యవసాయము 10000 9000 1000
ఆర్.కె.వి.వై. రేరింగు షెడ్డులకు వరండాల నిర్మాణము 60000 30000 30000
విదేశీ విత్తనముకు రాయితీ 0 750 0
వేప చెక్క (800 కిలోలు) 8060 4030 4030
రేరింగు షెడ్డుల నిర్మాణము 275000 137500 137500

 

2017 – 18 మరియు 2018 – 19 సంవత్సరములో వివిధ పధకముల క్రింద ఖర్చు చేసిన వివరములు :-

 

  • సి.డి.పి. పథకము క్రింద రైతులకు మల్బరీ మొక్కలు నాటినందుకు 2017-18 సంవత్సరమునకుగాను రూ.12968 లక్షలు, మరియు పట్టు పురుగులు పెంచు రేరింగు షెడ్డు నిర్మాణమునకు రూ.7.13375 లక్షలు ఖర్చు చేయడం జరిగినది. మరియు 2018–19 సంవత్సరములోరూ. 0.00 లక్షలు, మరియు పట్టు పురుగులు పెంచు రేరింగు షెడ్డు నిర్మాణమునకు రూ.0.00 లక్షలు ఖర్చు చేయడం జరిగినది.
  • పై పథకము క్రింద రైతులకు రేరింగు పరికరముల నిమిత్తము 2017-18 సంవత్సరములో రూ.6483 లక్షలు ఖర్చు చేయడం జరిగినది. మరియు 2018-19 సంవత్సరమునకు గాను రూ.1.14375 లక్షలు ఖర్చు చేయడం జరిగినది.
  • ఆర్.కె.వి.వై పధకము క్రింద రైతులకు పట్టుపురుగుల పెంపకపుగదులకు వరండాలు నిర్మించుకొనుటకు 50% రాయితీ (22500)  ఇవ్వడము జరుగుతుంది. 2017–18 సంవత్సరమునకు గాను రూ. 575 లక్షల రాయితీ ని (07) వరండాలకు రైతులకు ఆర్ధికసహాయం చేయడం జరిగినది. మరియు (15) రేరింగు షెడ్డు నిర్మాణమునకు  రూ.17.463 లక్షలు ఖర్చు చేయడం జరిగినది. మరియు 2018–19 సంవత్సరమునకు గాను రూ. 0.900 లక్షల రాయితీని (04) వరండాలకు రైతులకు ఆర్ధికసహాయం చేయడం జరిగినది. మరియు (01) రేరింగు షెడ్డు నిర్మాణమునకు  రూ.0.825 లక్షలు ఖర్చు చేయడం జరిగినది.
  • రైతులు బైవోల్టిన్ పట్టు గూళ్ళు పండించినందుకుగాను ప్రోత్సాహకము కింద  కిలో కు రూ. 50/- చొప్పున పట్టుగూళ్ళు అమ్మేసమయంలో మార్కెట్టులో రైతులకు చెల్లించడం జరుగుతుంది. 2017-18 సంవత్సరమునకు గాను ఈ పథకము కింద ఇంతవరకు రూ. 2275 లక్షల రాయితీ ఇవ్వడము జరిగినది. మరియు 2018-19 సంవత్సరమునకు గాను రూ. 32.024 లక్షల రాయితీ ఇవ్వడము జరిగినది.
  • రాష్ట్రీయ కృషి వికాస యోజన పథకము క్రింద భూసారాన్ని పెంచుటకై రైతులకు వేపచెక్క మరియు సూక్ష్మ పోషకాలు 50% రాయితీ తో సరఫరా చేయడం జరుగుతుంది. 2017-18 సంవత్సరములో (162) మంది రైతులకు 497 లక్షల రాయితీతో సరఫరా చేయడం జరిగినది.మరియు 2018-19 సంవత్సరములో (25) మంది రైతులకు 1.83136 లక్షల రాయితీతో సరఫరా చేయడం జరిగినది.
  • రైతులకు వ్యాధి నిరోధకాలు 75% రాయితీతో సరఫరా చేయడం జరిగుతుంది. 2017-18 సంవత్సరములో (310) మంది రైతులకు 6510 లక్షల రాయితీతో సరఫరా చేయడం జరిగినది. మరియు 2018-19 సంవత్సరములో (40) మంది రైతులకు 1.76664 లక్షల రాయితీతో సరఫరా చేయడం జరిగినది.
  • పట్టు కార్మికులకు పట్టు కొనుగోలు పై రాయితీ  క్రింద రూ. 250/- ప్రకారము (4) కేజిలకు మించకుండా మొత్తం రూ. 1000/- నెలకు చెల్లించబడుచున్నది ఈ పధకము కింద 2017–18
  • సంవత్సరము లో 9315 మంది కి గాను 8460 లక్షలు రాయితీగా విడుదల చేయడం జరిగినది. మరియు 2018–19 సంవత్సరము లో 833 మంది కి గాను 8.330 లక్షలు రాయితీగా విడుదల చేయడం జరిగినది.

 

ముఖ్యమైన నెంబర్లు
అధికారిక హోదా ఇమెయిల్ సంప్రదించండి
డిప్యూటీ.డైరెక్టర్ సర్కిల్చర్, కర్నూలు. ddsknl[at]gmail[dot]com 98666 99181
అసిస్టెంట్. డైరెక్టర్ సర్కిల్చర్, పేపుల్లి adsadoni[at]gmail[dot]com 98666 99181
అసిస్టెంట్. డైరెక్టర్ వ్యవసాయం, ఆత్మకూర్ adsatmk[at]gmail[dot]com 97046 50022

పట్టుపురుగుల పెంపకంపట్టుపురుగుల రేరింగ్ షెడ్లబ్ధిదారుడికి షెడ్పట్టు కాయలుమల్బరీ ప్లాంట్పట్టుపరిశ్రమ

ఉప సంచాలకులు,
పట్టు పరిశ్రమ శాఖ, కర్నూలు.