ఆత్మ
వ్యవసాయ సాంకేతిక యాజమాన్య సంస్థ
వ్యవసాయ మరియు అనుబoధ శాఖలైన పశుసంవర్ధక శాఖ, ఉద్యానవన శాఖ , మత్స్యశాఖ , పట్టు పరిశ్రమ శాఖల ద్వారా రైతులకు ఆధునిక సాంకేతిక సమాచారాన్ని చేరవేయుటకు జిల్లా స్థాయిలో ఏర్పాటు చేయబడిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ ‘ఆత్మ’. ఈ సంస్థకు గౌరవనీయులు జిల్లా కలెక్టరు గారు చైర్మన్ గా, ఆత్మ ప్రాజెక్ట్ డైరెక్టర్ మరియు వ్యవసాయ అనుబoధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, రైతు ప్రతినిధులు సభ్యులుగా ఆత్మ యాజమాన్య కమిటి ఉంటుంది . డివిజన్ స్థాయి లో సహాయ వ్యవసాయ సంచాలకులు కన్వీనర్ గా అనుబంధ శాఖల డివిజన్ మరియు మండల స్థాయి అధికారులు, అభ్యుదయ రైతులు సభ్యులుగా ఉన్న బ్లాక్ టెక్నాలజీ టీం ఆత్మ పథకము లోని కార్యక్రమాలను సమీక్షించి అమలు చేస్తుంది . వివిధ కార్యక్రమాల రూపకల్పనలో రైతుల భాగస్వామ్యం కొరకు జిల్లా స్థాయిలో అభ్యుదయ రైతులతో జిల్లా రైతు సలహా కమిటీ మరియు బ్లాక్ స్థాయిలో బ్లాక్ రైతు సలహా కమిటీలు పనిచేస్తాయి.
ఆత్మ ద్వారా వ్యవసాయ అనుబoధ రంగాలలో ఆధునిక సాంకేతిక సమాచారాన్ని రైతులకు చేరవేయుటకు వివిధ విస్తరణ కార్యక్రమాలు అనగా, శిక్షణ కార్యక్రమాలు, ప్రదర్శన క్షేత్రాలు మరియు విజ్ఞాన యాత్రలు శాస్త్రవేత్తల తో రైతుల చర్చ గోష్టి కార్యక్రమాలు, కిసాన్ మేళాలు రైతులకు అవార్డులు రైతు సంఘాల ఏర్పాటు, ఫల పుష్ప పంటల ప్రదర్శనలు నిర్వహించబడతాయి. ఈ కార్యక్రమాలను వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు పాల్గొని రైతుల నైపుణ్యాన్ని, శాస్త్రీయ పరిజ్ఞానాన్ని పెంపొందిచటానికి కృషి చేస్తారు .
జిల్లా మరియు డివిజన్ స్థాయిలో చేపట్టు వివిధ కార్యక్రమాలు రూపకల్పన చేయుటకు ముందుగా బ్లాక్ స్థాయిలో ప్రతిపాదనలు సలహా మండలి సమావేశము బ్లాక్ స్థాయిలో చర్చించి సలహా మండలి ఆమోదముతో జిల్లా స్థాయికి పంపబడతాయి వీటన్నిటిని క్రోడీకరించి జిల్లా స్థాయిలో చేపట్టు ఇతర కార్యక్రమాలను జోడించి జిల్లా సలహా మండలి మరియు యాజమాన్య కమిటి ఆమోదముతో జిల్లా స్థాయి కార్యాచరణ ప్రణాళిక తయారవుతుంది.
క్రమ సంఖ్య | శాఖ | ప్రతిపాదించబడిన బడ్జేట్ విలువ(రూ. లక్షలు) |
---|---|---|
1 | వ్యవసాయ శాఖ | 133.90 |
2 | పశు సంవర్ధక శాఖ | 40.10 |
3 | ఉద్యానశాఖ | 49.97 |
4 | పట్టుపరిశ్రమ శాఖ | 4.16 |
5 | మత్స్య శాఖ | 3.44 |
మొత్తo | 231.57 |
క్రమ సంఖ్య | కార్యక్రమముల వివరములు | నిధుల మంజూరు |
---|---|---|
1 | శిక్షణ | 9.50 |
2 | ప్రదర్శన క్షేత్రాలు | 10.50 |
3 | విజ్ఞాన యాత్రలు | 9.00 |
4 | రైతు సంఘాలను చైతన్య పరచు కార్యక్రమాలు | 1.00 |
5 | కిసాన్ మేళాలు | 2.00 |
6 | సమాచార విస్తరణ | 1.25 |
7 | రైతు శాస్త్రవేత్తలతో చర్చ | 0.40 |
8 | జిల్లాలో KVK / ANGRAU నిపుణుల సలహా/ సంప్రదింపులు | 0.24 |
9 | క్షేత్ర దినోత్సవo | 1.65 |
10 | క్షేత్ర పాఠశాలలు | 3.19 |
11 | వ్యవసాయ మరియు అనుబంధ రంగాలలో వినూత్న కార్యక్రమాలు | 4.50 |
మొత్తo | 43.23 |
క్రమ సంఖ్య | కార్యక్రమముల వివరములు | సంఖ్య | విడుదల చేయబడిన నిధులు రూ. లక్షలలో |
---|---|---|---|
1 | నైపుణ్యాభివృద్ది శిక్షణ కార్యక్రమాలు | 3 | 1.26 |
2 | కిసాన్ కళ్యాణ్ కార్యశాల | 11 | 11.00 |
3 | ఏరువాక పున్నమి
a.గౌరవ శాసన సభ్యుల నియోజక వర్గ స్థాయిలో |
13 |
2.6 |
b.జిల్లా స్థాయిలో | 1 | 1.5 | |
4 | ప్రత్తి పై గులాబీ రంగు పురుగు నివారణకు అవగాహన సదస్సు | 33 | 1.65 |
5 | వేరుశనగ మరియు కంది పంటలలో బెట్టను తట్టుకొను నూతన వంగడములతో ప్రదర్శన క్షేత్రాల ఏర్పాటు | 76 | 0.85 |
6 | మెట్ట పంటలలో నీటి ఎద్దడి తట్టుకొని దిగుబడులు సాధించుటకు | 75 | 1.05 |
7 | AMC స్థాయిలో ప్రతి నెల 1, 16 తారీఖులలో సదస్సులు నిర్వహించుటకు | 55 | 4.125 |
8 | వివిధ పంటలలో స్థానిక అవసరాలను బట్టి ప్రదర్శన క్షేత్రాలు. | 12 | 5.16 |
9 | పరిశోధన, విస్తరణ సమన్వయంతో కే . వి. కే యాగంటిపల్లి మరియు బనవాసిలలో వివిధ కార్యక్రమములు చేబట్టుటకు | 50 | 1.50 |
10 | అంతర్జాతీయ వ్యవసాయ మరియు ఉద్యానప్రదర్శన, న్యూఢిల్లీ – విజ్ఞాన యాత్ర | 1 | 0.57 |
మొత్తo | 330 | 31.265 |
సమగ్ర చిరు ధాన్యాల అభివృద్ధి పథకము కృషి విజ్ఞాన కేంద్రo, యాగంటిపల్లి ద్వారా క్రింది సంవత్సరము 2016-17 నుంచి బేతంచెర్ల మరియు బనగానపల్లె మండలములలో చిరు ధాన్యాల విస్తీర్ణము, ఉత్పత్తి, వినియోగము పెంచుట, మార్కెట్ సౌకర్యం కల్పిoచుట మరియు ప్రాసెసింగ్ యంత్రాలు సరఫరా చేయుట మొదలగు కార్యక్రమాలు నిర్వహించబడుతున్నవి.
ఇప్పుడు వీటితోపాటు MANAGE వారి ఆధ్వర్యములో ఆత్మ ద్వారా వ్యవసాయ వనరులు విక్రయదారులకు DAESI డిప్లొమా కోర్సు ఒక సంవత్సరము కాలపరిమితితో ఒక బ్యాచ్ కు 40 మంది సభ్యులతో వ్యవసాయ యాజమాన్యం విస్తరణ పై రెండు బ్యాచ్ లకు కృషివిజ్ఞానకేంద్రo, బనవాసిలో ప్రస్తుతం, నిర్వహించబడుచున్నవి.
ఆత్మ ద్వారా ఆంధ్రప్రదేశ్ కరువు సంసిద్ధత పథకం- (పల్లె జీవo) APDMP ఐదు సంవత్సరముల కాలపరిమితి తో 2018–19 ఆర్ధిక సంవత్సరము నుంచి ఎంపిక చేయబడిన 21 వర్షాభావ మండలాలలో వివిధ కార్యక్రమములు అరణ్య మరియు CSA స్వచ్చంద సంస్థల ద్వారా నిర్వహించబడుచున్నవి.
ఈ పథకము క్రింద సహజవనరుల యాజమాన్యo క్రింద నేల మరియు తేమ సంరక్షణ కార్యక్రమాలు మరియు వర్షాభావ పరిస్థితులలో పంటలలో దిగుబడులు పెంచుటకు వివిధ పద్దతులు, మరియు కార్యక్రమములు. అదే విధంగా చిన్న జీవాల మరియు పెరటికోళ్ళు పెంపకం, రాత్రి వేళలలో వాటి భద్రత కొరకు ఆశ్రయాలు (బసలు) మరియు అభివృద్ధి పరుచు కార్యక్రమాలు చేపట్టబడుచున్నవి.
ఈ కార్యక్రమములు స్వచ్చంధ సంస్థలు మరియు గ్రామములో రైతు ఉత్పత్తి దారుల సంఘాల ఆధ్వర్యములో నిర్వహించబడును.